బాలీవుడ్ లో బాయ్ కాట్ కల్చర్ చాప కింద నీరులా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. నెగిటివ్ కామెంట్లు హీరోలు ఎప్పుడు చేసినా? వాటిని తవ్వి తీసి మరీ ఆ హీరో సినిమాని బాయ్ కాట్ చేయండి! అంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు. తమ అక్కసుని కసితీరా తీర్చికుంటున్నారు. ఇటీవల రిలీజ్ అయిన 'లాల్ సింగ్ చడ్డా' అలా బాయ్ కాట్ కి బలైందే.
బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ సైతం ఈ సన్నివేశాన్ని ఎదుర్కో వాల్సి వచ్చింది. ఒక్క రోజులోనే 100 కోట్లు తెచ్చే స్టామినా ఉన్న హీరో 10 కోట్లు తెచ్చాడు. అంటే ఎంతగా ప్రభావం చూపుతుందో అద్దం పడుతుంది. అటుపై 'లైగర్' హిందీ వెర్షన్ పైనా బాయ్ కాట్ ప్రభావం గట్టిగానే పండింది. బాయ్ కాట్ చేస్తారా? చూసుకుందాం' అంటూ విజయ్ దేవరకొండ హెచ్చరించడంతో సీన్ సితారైంది.
పబ్లిక్ గానే ఓ థియేటర్ యజమాని విజయ్ పై మండిపడ్డాడు. 'రక్షాబంధన్'..'బ్రహ్మాస్ర్త' లాంటి సినిమాలపైనా పాక్షికంగా ఆ ప్రభావం పడింది. దీంతో హీరోల వెన్నులో ఒక్కసారిగా ఒణుకు మొదలైంది. సోషల్ మీడియాలో ఆచితూచి వ్యవహరించాలని అర్ధమైంది. అయితే బాయ్ కాట్ ట్రెండ్ సౌత్ లో అంతగా లేదు. తాజాగా ఇదే విషయంపై మలయాళ నటుడు దుల్కార్ సల్మాన్ స్పందించారు.
ఆయన హీరోగా హిందీలో నటించిన 'చుప్ ది రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్' సెప్టెంబర్ 23న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా బాయ్ కాట్ పై తనదైన శైలిలో స్పందించారు. సోషల్ మీడియా కారణంగా బాయ్ కాట్ కల్చర్ ఎక్కువైంది. ఎవరైనా ఏదైనా చాలా స్వేచ్ఛగా సోషల్ మీడియాలో రాసుకోవచ్చు. అందుకే బాధ్యత లేకుండా చాలా మంది సొంత అజెండాతో వెబ్ మీడియాలో ముందుకెళ్తున్నారు.
లక్కీగా ఆ కల్చర్ మన సౌత్ లో లేదు. భయంకరమైన దారుణమైన కల్చర్ ని బాలీవుడ్ లోనే వింటున్నాం' అని అన్నారు. మరి ఆయన వ్యాఖ్యలపై బాలీవుడ్ నెటి జనులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ప్రస్తుతం ఆయన నటిస్తన్న చుప్ సినిమా హిందీలో రిలీజ్ కి రెడీ అవుతుంది.
ఇలాంటి సమయంలో బాయ్ కాట్ ట్రెండ్ పై స్పందించడం అన్నది కొరితే తలగొక్కున్నట్లే అవుతుందని అంటున్నారు. చుప్ లో దుల్కార్ తో పాటు..సన్నిడియోల్ ..శ్రేయా ధన్వంతరి.. పూజా భట్ నటిస్తున్నారు. దు ల్కార్ కారణంగా మిగతా వారు ఇబ్బం దుల్లో పడే అవకాశం ఉందని నెటి జనులు అప్పుడే సంకేతాలు పాస్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.