సూపర్ హిట్‌ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ అప్డేట్ వచ్చేసింది

Update: 2021-12-14 16:30 GMT
ఈమద్య కాలంలో థియేటర్‌ లో విడుదల అయిన సినిమాలు కేవలం నాలుగు అయిదు వారాల్లోనే ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. కొన్ని ప్లాప్ సినిమాలు మరీ మూడు వారాల్లో కూడా స్ట్రీమింగ్‌ కు రెడీ అవుతున్నాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా రెండు నెలల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ నిబంధనలు పక్కన పెట్టేస్తున్నారు.

థియేటర్ల ద్వారా మునుపటి రేంజ్ లో వసూళ్లు రావడం లేదు. కనుక తప్పని సరి పరిస్థితుల్లో థియేటర్ లో విడుదల అయిన ఎంత పెద్ద సినిమా అయినా.. ఎంత పెద్ద హిట్ సినిమా అయినా కూడా నెల రోజుల్లోనే ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అవ్వాల్సిందే. ఆ వెంటనే కొన్ని రోజులకు శాటిలైట్ ద్వారా టెలికాస్ట్‌ అవ్వాల్సిందే. ఇప్పుడు సూపర్‌ హిట్ మలయాళ మూవీ కురుప్‌ స్ట్రీమింగ్ కు ఓటీటీ సిద్దం అయ్యింది.

దుల్కర్ సల్మాన్‌ ప్రధాన పాత్రలో నటించిన కురుప్‌ సినిమా మలయాళంలోనే కాకుండా అన్ని చోట్ల కూడా మంచి వసూళ్లు రాబట్టింది. మహానటి సినిమా తో దుల్కర్ కు తెలుగు లో మంచి క్రేజ్ దక్కింది. అందుకే తెలుగు లో ఈ సినిమా ను బాగానే జనాలు ఆధరించారు.. భారీ వసూళ్లు నమోదు అయ్యాయి అనేది టాక్.

బాక్సాఫీస్ వర్గాలు మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా 100 కోట్ల వసూళ్లు నమోదు చేసింది అంటున్నారు. అంతటి భారీ విజయాన్నిసొంతం చేసుకున్న కురుప్‌ ను నెట్‌ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. నవంబర్‌ 12వ తారీకున విడుదల అయిన కురుప్‌ సినిమాను అయిదు వారాల తర్వాత స్ట్రీమింగ్‌ కు సిద్దం చేస్తున్నారు.

డిసెంబర్‌ 17వ తారీకు నుండి నెట్‌ ఫ్లిక్స్ లో అన్ని భాషల్లోనే కురుప్ అందుబాటులో ఉంటుందని సమాచారం అందుతోంది. పెద్ద ఎత్తున ఈ సినిమా ను నెట్‌ ఫ్లిక్స్ లో జనాలు చూస్తారా అనేది చూడాలి.

ఎందుకంటే అమెజాన్‌ ఇతర ఓటీటీలతో పోల్చితే ఇండియాలో నెట్‌ ఫ్లిక్స్ మార్కెట్‌ తక్కువగా ఉంది. ఎక్కువ కంటెంట్‌ ను అందిస్తున్నా కూడా తక్కు మొత్తం లోనే ఆ ఓటీటీ కి సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఈమద్య కాలంలో సబ్‌ స్క్రిప్షన్‌ చార్జీలు తగ్గించడం వల్ల నెట్‌ ఫ్లిక్స్ కు భారీగా ఖాతాదారులు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
Tags:    

Similar News