దర్శకుడు హీరో నడుమ లేదా దర్శకుడు నిర్మాత నడుమా లేదా దర్శకుడు కెమెరామేన్ మధ్య ఏదైనా సమస్య వస్తే దానిని వెంటనే పరిష్కరించాలి. లేదంటే దాని ప్రభావం ప్రాజెక్ట్ అంతటా స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజుల్లో క్రియేటివ్ డిఫరెన్సెస్ చాలా సహజంగానే బయటపడుతున్నాయి. ఇలాంటి వివాదాల గురించి చాలా చర్చ సాగుతోంది.
ఇలాంటి వివాదం కారణంగానే శంకర్- కమల్ హాసన్ ల క్రేజీ చిత్రం భారతీయుడు 2 అటకెక్కింది. నిర్మాత సుభాష్కరణ్ తో శంకర్ వివాదం భారీ చిత్రాన్ని చిక్కుల్లో పడేసింది. ఈ మూవీకి ఇప్పటికీ సరైన క్లియరెన్స్ లేదు. ఇప్పుడు బాలీవుడ్ లో ఇలాంటిదే మరొకటి బయటపడింది. కింగ్ ఖాన్ షారూక్ కథానాయకుడిగా రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కిస్తున్న డుంకీ మూవీ సెట్స్ నుంచి కెమెరామేన్ వాకౌట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది.
కొన్ని రోజుల క్రితం డుంకీ కెమెరామెన్ అమిత్ రాయ్ ఈ చిత్రం నుండి వైదొలిగడం హైటెన్షన్ క్రియేట్ చేసింది. అతడు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ దానిపై అమిత్ అప్పటికి స్పందించలేదు. ఎట్టకేలకు ఇప్పుడు మొదటిసారిగా అమిత్ రాయ్ దీనిపై ఓపెనయ్యాడు. ``మేమిద్దరం (దర్శకుడు - నేను) ఒకే పేజీలో అంగీకరించకపోతే ఘర్షణ పెరుగుతుందని నేను భావించే స్థాయికి సన్నివేశం చేరుకుంది. అందుకే నేను ఈ చిత్రం నుండి తప్పుకున్నాను`` అని వెల్లడించాడు.
డుంకీకి రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహిస్తున్నారు. అతనికి అమిత్ రాయ్ కి మధ్య ఉన్న సమస్యలు ఈ చిత్రం వల్ల బయటకు వచ్చేలా చేశాయి. ఇరువురి నడుమా క్రియేటివ్ డిఫరెన్సెస్ చాలా స్పష్టంగా బయటపడ్డాయి. ఛాయాగ్రాహకుడితో దర్శకుడికి సెట్ కాకపోతే అలాంటి సినిమా ఏమవుతుందో ఊహించగలం. డుంకీ చిత్రంలో తాప్సీ కథానాయికగా నటిస్తోంది. కింగ్ ఖాన్ లాంటి అగ్రహీరో సరసన ఇది తాప్సీకి జాక్ పాట్ అని చెప్పాలి.