టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు షాకిస్తున్న డస్కీబ్యూటీ!

Update: 2021-04-28 09:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మెల్లమెల్లగా పరభాషా హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలంటూ చేరి హిట్టు పడేసరికి ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు. మాములుగా తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి హీరోయిన్స్ కాకుండా కొత్తగా వస్తున్నవారే చేతినిండా సినిమాలు దక్కించుకుంటున్నారు. అందం గ్లామర్ అనే అంశాలు పక్కన పెడితే అభినయం పరంగా ఆకట్టుకుంటూ ప్రేక్షకులకు దగ్గరవుతున్న హీరోయిన్స్ తక్కువగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయిపోయింది. ఆమె ఎవరో కాదు సౌత్ డస్కీ బ్యూటీ ఐశ్వర్యరాజేష్. ఈ భామ కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు డెబ్యూ చేసింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ అమ్మడికి అవకాశాలకు మాత్రం కొదవే లేదు.

ఐశ్వర్య ఆల్రెడీ తమిళంలో మంచి క్రేజ్ తో గుర్తింపు కలిగిన హీరోయిన్. ఎక్కువగా పల్లెటూరి అమ్మాయిగా మోటు పాత్రలే చేస్తూ అలరించింది. ఇప్పుడు అదే మోటు అందాలతో తెలుగులో కూడా చక్రం తిప్పేస్తుంది. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోయిన్స్ కంటే కూడా ఐశ్వర్య బిజీ కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ నమ్మక తప్పదు. ఎందుకంటే మాక్సిమం హీరోయిన్స్ అంతా అందం, గ్లామర్ అంటూ పరుగులు తీస్తుంటారు. కానీ ఐశ్వర్య అలా కాదు. తన అందం గురించి.. హీరోయిన్ మెటీరియల్ గురించి కాకుండా కేవలం నటనకు ఆస్కారం ఉన్న సినిమాలే ఎంచుకుంటూ మెల్లమెల్లగా ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంటుంది. ఇంకొద్ది కాలంలో అమ్మడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా ఆశ్చర్యపోయే అవసరం లేదు. ప్రస్తుతం ఐశ్వర్య చేతిలో 8 సినిమాలున్నాయి. అందులో రిపబ్లిక్, టక్ జగదీష్, ఏకే రీమేక్ తెలుగు సినిమాలున్నాయి. చూడాలి మరి ఈ డస్కీ బ్యూటీ స్టార్డం అందుకుంటుందేమో!






Tags:    

Similar News