దసరా సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో కింగ్ నాగార్జున ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు కూడా ఒక్క రోజు కూడా తేడా లేకుండా అక్టోబర్ 5వ తారీకున విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఒకే రోజు రెండు సినిమాలు.. అది కూడా స్టార్ హీరోల సినిమాలు విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ సినిమాలపై ఉంది.
ఈ రెండు సినిమాలు కూడా ఇద్దరు హీరోలకు అత్యంత కీలకం అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తర్వాత ఈ సినిమాతో రాబోతున్నాడు. ఆచార్య సినిమా మరీ దారుణమైన వసూళ్లను నమోదు చేసింది. కనుక ఈ సినిమా తో తన స్థాయి ని మరియు స్టార్ డమ్ ను మెగాస్టార్ నిరూపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
ఇక చిరంజీవి మరియు నాగార్జునలు ఇప్పటి వరకు ఫుల్ స్వింగ్ లోకి ప్రమోషన్స్ కోసం రాలేదు. ప్రమోషన్ కార్యక్రమాలు ఇంకా పూర్తి స్థాయిలో షురూ అయినట్లుగా కనిపించడం లేదు. ముఖ్యంగా గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో మెగా ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఈ రెండు సినిమాల యొక్క రాయలసీమ సెంటిమెంట్ గురించి చర్చ జరుగుతోంది.
గాడ్ ఫాదర్ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అనంతపురంలో నిర్వహించబోతున్నట్లుగా చాలా రోజుల క్రితమే క్లారిటీ వచ్చింది. తాజాగా ది ఘోస్ట్ యొక్క ప్రీ రిలీజ్ వేడుకను అదే రాయలసీమ లోని కర్నూల్ లో నిర్వహించబోతున్నట్లుగా అన్నపూర్ణ స్టూడియోస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ది ఘోస్ట్ కి ఈనెల 25వ తారీకున భారీ ఎత్తున కర్నూలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఇదే నెల 28న అనంతపురం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ది గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిపేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ రెండు సినిమాలు దసరాకు ఒకే రోజు రాబోతున్నాయి.. మరో వైపు రాయలసీమలోనే సినిమాల యొక్క ప్రీ రిలీజ్ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు సినిమాలు రాయలసీమలోనే ఎందుకు ప్రీ రిలీజ్ వేడుకలు జరుపుకుంటున్నాయి.. అందులో ఏమైనా సెంటిమెంట్ ఉందా అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో జరుగుతున్న ఆసక్తికర చర్చ.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.