ఎర్లీమార్నింగ్ 500 మందితో హీరో రేస్!

Update: 2022-10-19 00:30 GMT
తెల్ల‌వారుతోన్న స‌మ‌యం అది. చీక‌టి చించుకుని వెలుగులోకి వ‌స్తోన్న గ‌డియ‌లు. స‌రిగ్గా హీరోగారు అప్పుడే రేస్ కి బ‌య‌ల్దేరారు. అదీ ఒక‌రిద్ద‌రితో కాదు..ఏకంగా 500 మందితో?  ఒక‌రిపై ఒక‌రు ర‌య్ ర‌య్ అంటూ  దూసుకుపోతున్నారు. 500 మంది  పోటీ ఉన్న‌ రేస్ లో గెల‌వాలంటే ఎంత‌గా శ్రమించాలో తెలుస్తోందిగా.  అంటే ఊహించుకోండి ఆ స‌న్నివేశం ఏ రేంజ్ లో ఉంటుందో.

మ‌రి ఇంత కి అంత సాహ‌సానికి పూనుకున్న హీరో ఎవ‌రు? ఇది సినిమాలో స‌న్నివేశామా?  లేక బ‌య‌ట  వాస్త‌వంగా జ‌రిగిందా? అంటే వివ‌రాల్లోకి వె ళ్లాల్సిందే. ప్ర‌స్తుతం బాలీవుడ్ హీరో షారుక్  ఖాన్ క‌థానాయ‌కుడి రాజ్ కుమార్ హిరాణీ ద‌ర్శ‌క‌త్వంలో `డంకీ` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ లో సినిమా సెట్స్ కి వెళ్లింది.

ఇటీవ‌లే లండ‌న్ బుడాపెస్ట్ షెడ్యూల్ని  పూర్తిచేసారు. అయితే అంత‌కు ముందే ముంబైలో భారీ యాక్ష‌న్ రేస్ ఎపిసోడ్ ని పూర్తిచేసారు. రేస్ కి సంబంధించినో భారీ సెట్ నిర్మించి 500 మంది రేస‌ర్ల మ‌ధ్య ఈ స‌న్నివేశాన్ని తెల్ల‌వారుజామున‌ చిత్రీక‌రించిన‌ట్లు స‌మాచారం. ఇందులో షారుక్ తో పాటు..బోమ‌న్ ఇరానీ కూడా పాల్గొన్నారు.

త్వ‌ర‌లో మ‌రో కీల‌క షెడ్యూల్ ని సౌదీలో ప్లాన్ చేస్తున్నారు. న‌వంబ‌ర్ మిడ్ లో 12 రోజుల పాటు ఈ షెడ్యూల్ నిర్వ‌హిస్తున్నారు.  అందుకోసం ముంబై నుంచి న‌టీన‌టులు..సాంకేతిక నిపుణులు ప్ర‌త్యేక ప్లైట్ లో వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం. అలాగే అవ‌స‌రం మేర సౌదీ  బృందాన్ని వినియోగించుకోనున్నారుట‌.  ఇందులో విక్కీ కౌశ‌ల్..తాప్సీ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఆ పాత్ర‌లు సైతం ఛాలెంజింగ్ గా సాగుతాయ‌ని తెలుస్తోంది. అక్ర‌మ వ‌ల‌స‌ల నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. రాజ్ కుమార్ హిరాణీ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా మ‌లుస్తున్న‌ట్లు తెలుస్తుంది. అన్ని ప‌నులు పూర్తిచేసి వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయ‌నున్నారు. అంటే షూటింగ్ పూర్తిచేయ‌డానికి చాలా స‌మ‌యం తీసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంట‌ర్ టైన్ మెంట్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది. ఇంకా షారుక్ `పఠాన్`...`జ‌వాన్` చిత్రాల్లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఒకేసారి మూడు సినిమాలు షూటింగ్ లో పాల్గొంటూ బాద్ షా బిజీగా ఉన్నారు. మ‌రోవైపు కొత్త క‌థ‌ల‌పైనా ఫోక‌స్ పెడుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News