మిథున్ చక్రవర్తి.. ఈ బెంగాలీ బాబు బాలీవుడ్ తెరనేలిన వ్యక్తి. యాంగ్రి యంగ్ మ్యాన్ పాత్రల్లో రాణించి స్టార్‌గా వెలుగొందిన హీరో. ఇప్పటికీ బాలీవుడ్‌లో మిథున్‌కు మంచి క్రేజే ఉంది. స్టార్ స్టేటస్ ఉంది.
కొంత కాలం కిందట మిథున్ రాజకీయాలవైపు వెళ్లాడు. తృణమూల్ కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడయ్యాడు. అలాంటి హోదాలో ఉన్న మిథున్ ఇప్పుడు కొత్త వివాదంలో ఇరుక్కొన్నాడు.
ఇప్పటికే పశ్చిమబెంగాల్‌ను, తృణమూల్ కాంగ్రెస్‌ను శారదాచిట్‌ఫండ్ స్కామ్ వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ స్కామ్‌లో మిథున్ కూడా ఇరుక్కొన్నాడు.
గతంలో మిథున్ శారదా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశాడు. ఈ నేపథ్యంలో ఈ స్కామ్ గురించి విచారణ జరుపుతున్న సీబీఐ మిథున్‌కు కూడా నోటీసులు జారీ చేసింది. అతడి నుంచి వివరణ కోరింది.
అయితే ఈ విషయం గురించి మిథున్ సరిగా స్పందించకపోవడంతో సీబీఐ తదుపరి చర్యలకు సిద్ధం అవుతున్నట్టుగా సమాచారం. మరి ఈ స్టార్ హీరోకు ఈ చిట్‌ఫండ్ స్కామ్ ఇంకా ఎలాంటి ఇబ్బందులను తెచ్చిపెడుతుందో!