స్పై ఆపరేషన్... గూఢచారి కథలకు ఉన్న వెయిట్ వేరే లెవల్. బాండ్ 007 స్ఫూర్తితో.. బార్న్ సిరీస్ స్ఫూర్తితో ఎన్నో వెర్షన్లు ఇండియాలోను పుట్టుకొచ్చాయి. అవన్నీ ఎంతో క్యూరియాసిటీని పెంచడమే గాక.. బంపర్ హిట్లు కొట్టాయి. అందుకే ఇప్పుడు వస్తున్న ఓ మూడు సినిమాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కింగ్ ఖాన్ షారూక్.. తమిళ హీరో కార్తీ.. టాలీవుడ్ యంగ్ చియాన్ అఖిల్ ఈ ముగ్గురూ ప్రస్తుతం దేశభక్తి- స్పై ఆపరేషన్ కథల్లో నటిస్తూ వేడి పెంచుతున్నారు.
తాజాగా కార్తీ నటించిన `సర్దార్` థియేట్రికల్ ట్రైలర్ విడుదలై రకరకాల సందేహాలు లేవనెత్తింది. ట్రైలర్ ను బట్టి చూస్తే ఇది స్పై థ్రిల్లర్ అని అర్థమవుతోంది. అక్టోబర్ 21న విడుదల కానున్న ఈ చిత్రానికి అభిమన్యుడు ఫేం పి.ఎస్. మిత్రన్ దర్శకుడు. ట్రైలర్ విడుదలైనప్పటి నుండి సర్దార్ కథాంశం షారుఖ్ ఖాన్ నటిస్తునన `జవాన్` తరహాలోనే ఉందని సోషల్ మీడియాలో పుకారు మొదలైంది. ఈ గాసిప్ షారుక్ - కార్తీ అభిమానులకు భారీ షాక్ నిస్తోంది. షారుఖ్ నటించిన జవాన్ కు తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే జవాన్ పాన్ ఇండియన్ మూవీగా ప్రచారంలో ఉంది. కానీ ఇలాంటి సమయంలో ఈ వార్తా కథనాలు అభిమానులకు రుచించడం లేదు.
ఇంతకీ ఈ రెండు సినిమాలకు పోలిక ఉందా? ఒకే తరహా కథాంశంతో రూపొందుతున్నాయా? అన్న సందేహాలను తీర్చేందుకు.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ ఎడిటర్ రూబెన్ ఇప్పుడు లైన్ లోకొచ్చారు. ఆయన ఈ పుకార్లను ఖండించారు. ఈ రెండు చిత్రాలకు రూబెన్ ఎడిటింగ్ చేస్తున్నాడు. రెండు సినిమాల్లోనూ సారూప్యత లేదని స్పష్టం చేసి అభిమానులకు భారీ ఊరటనిచ్చాడు. జవాన్ 2 జూన్ 2023న విడుదల కానుంది.

ఎవరు ఏం చెప్పినా స్పై థ్రిల్లర్ కాన్సెప్టులన్నీ ఇంచుమించు ఒకే థీమ్ లైన్ తో ఉంటాయి. హీరోలు మారతారు.. నేరేషన్ మారుతుంది అంతే! అఖిల్ నటిస్తున్న ఏజెంట్ లైన్ కూడా వీటికి భిన్నంగా ఉండదని సోషల్ మీడియాలోని ఒక సెక్షన్ లో వాదన మొదలైంది. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అంతకంతకు కాన్వాసు మారి ఇది కూడా ఇప్పుడు పాన్ ఇండియా కేటగిరీలో విడుదలకు సిద్ధమవుతుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గూఢచారి కథలతో ఈ మూడు సినిమాలు దేనికదే యూనిక్ అని నిరూపిస్తాయని ఆశిద్దాం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.