ఈ నగరానికి ఏమైంది.. రీ రిలీజ్ కి రెడీ

Update: 2023-01-14 23:30 GMT
ఈ మధ్యకాలంలో రీరిలీజ్ ట్రెండ్ భాగా నడుస్తుంది. స్టార్ హీరోల చిత్రాలని మళ్ళీ ఓ రెండు రోజుల పాటు బిగ్ స్క్రీన్ పై ప్రదర్శనకి వేస్తున్నారు. అప్పటి సినిమాని 4కె లోకి మార్చి మళ్ళీ ఫ్రెష్ ఫీల్ తో ప్రేక్షకులలకి కొత్త అనుభూతి అందించే ప్రయత్నం చేస్తున్నారు. వీటిలో చాలా వరకు ఫ్యాన్స్ షోస్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ, తమ్ముడు రిరిలీజ్ చేసి మంచి కలెక్షన్స్ రాబట్టారు.

తరువాత బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి మూవీ కూడా రీరిలీజ్ చేశారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి, అలాగే రీసెంట్ గా ఒక్కడు సినిమాలని రీరిలీజ్ చేసి ప్రేక్షకులకి వినోదాన్ని అందించారు. ముఖ్యంగా ఫ్యాన్స్ ఈ రీరిలీజ్ షోలకి ఎక్కువగా వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కుషి సినిమా అయితే రీరిలీజ్ లో ఏకంగా 4 కోట్ల వరకు కలెక్ట్ చేసిందనే మాట వినిపిస్తుంది. ఈ రీరిలీజ్ తో వచ్చిన డబ్బుని ఎన్జీవోలకి డొనేషన్స్ గా ఇస్తున్నారు.

అలాగే కౌలు ఖుషితో వచ్చిన డబ్బులని కౌలు రైతులకి సాయం కోసం ఇచ్చారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో సినిమాల రీరిలీజ్ ట్రెండ్ ఎన్టీఆర్ మాయాబజార్ తో స్టార్ట్ అయ్యింది. ఆ మూవీని కలర్ గ్రేడ్ లోకి మార్చి రీరిలీజ్ చేశారు. అప్పట్లో సెకండ్ రిలీజ్ సందర్భంగా కూడా మూవీకి మంచి హైప్ క్రియేట్ అయ్యింది. చాలా కాలం తర్వాత మరల గత ఏడాది ఈ రీరిలీజ్ ట్రెండ్ తెరపైకి వచ్చింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ దారిలోకి కొన్ని ఈ జెనరేషన్ మూవీస్ కూడా వచ్చి చేరుతున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది మళ్ళీ రీరిలీజ్ కి రెడీ అవుతుంది. నాలుగేళ్ల క్రితం ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే తరుణ్ భాస్కర్ మొదటి సినిమా పెళ్లి చూపులు రేంజ్ లో ఆదరణ సొంతం చేసుకోలేదు.

ఎవరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. అయితే బడ్జెట్ పరిమితులతో తెరకెక్కిన చిత్రం కావడం  సురేష్ బాబుకి మాత్రం భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా ఒటీటీలో కూడా అందుబాటులో ఉంటుంది. అయితే మళ్ళీ ఎందుకనో మూవీని థియేటర్స్ లో రీరిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మరి ఈరీరిలీజ్ లో ప్రేక్షకులని ఈ సినిమా ఆకట్టుకుంటుందా, స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చేలా చేస్తుందా అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News