ఉగాది పర్వదినం నాడు విడుదలైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా గురించి ప్రముఖ మీడియా సంస్థ ఈనాడు ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేసింది. సినిమా విజయం గురించి.. పరాజయం గురించి ఎక్కువగా ప్రస్తావించకుండా.. ఆచితూచి రాసే ఈ మీడియా సంస్థ.. సర్దార్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. తాజాగా పవన్ కల్యాణ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ను ప్రచురించింది.
ఈ సందర్భంగా పవన్ గురించి.. ఆయన వ్యక్తిత్వం గురించి నాలుగు మాటలు రాసేసిన సదరు సంస్థ.. తాజాగా విడుదలైన సర్దార్ గబ్బర్ సింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్య చేసింది. ఓపక్క సినీ విమర్శకులు.. ట్రేడ్ అనలిస్ట్ లు సినిమా పోయిందని ఓపెన్ గా చెప్పేస్తూ.. సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుంటే.. ఈనాడు మాత్రం రంగు అక్షరాల్లో పెద్ద సైజులో చేసిన వ్యాఖ్యను చూసినప్పుడు అదేంటి ఈనాడు..? అలా రాసిందన్న భావన కలగటం ఖాయం.
ఇంతకీ సర్దార్ గురించి ‘ఈనాడు’ మాటేమిటన్నది వారి మాటల్లోనే చూస్తే.‘‘ఆయన (పవన్) నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వసూళ్లలో గత రికార్డుల్ని తిరగరాస్తోంది. ఈ సందర్భంగా పవన్ తో సంభాషించింది’’ అని అచ్చేశారు. ఓపక్క సినీ విమర్శకుల మాటలకు.. ‘ఈనాడు’ అక్షరాలకు సింక్ అవ్వటం లేదే..?