ఇప్పుడంటే టెక్నాలజీ పుణ్యమా అని మొత్తం డిజిటల్ అయిపోయింది కాని ఒకప్పుడు సినిమా ప్రింట్ అంటే రీలే. చుట్టలు చుట్టినట్టు కొన్ని పార్టులుగా ఒకే బాక్సులో పేర్చి విడుదల రోజున ఊరేగింపుగా తీసుకొచ్చే సీన్ ప్రతి ఊళ్ళో కనిపించేది. కాకపోతే నాణ్యత విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చేవి. నెగటివ్ రూపంలో ఒక ప్రింట్ ను పదే పదే థియేటర్లో వేస్తే గీతలు పడి స్క్రీన్ మీద అదోరకంగా ఉండేది. అందుకే పాత సినిమాలు కొన్ని ఎంత డిజిటల్ ఫార్మాట్ లోకి మార్చినా క్లారిటీ తగ్గడం చూస్తూ ఉంటాం. కాని అలా చూస్తేనే సహజంగా అనిపిస్తుంది. అప్పటి జ్ఞాపకాల్లోకి తీసుకు వెళ్తుంది. అందుకే సావిత్రి జీవిత కథ ఆధారంగా దర్శకుడు నాగ అశ్విన్ రూపొందించిన మహానటి సినిమాకు సంబంధించి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా కేర్ తీసుకున్నాడని టాక్. సావిత్రి గారు నటించిన పాత సినిమాల్లోని అపురూపమైన పాటలు దృశ్యాలు రీ షూట్ చేసిన అశ్విన్ వాటికి సహజత్వం కోసం నిజంగానే పాత రీళ్ళు తీసుకొచ్చి అప్పటి కెమెరాతోనే షూట్ చేయించాడట.
కాని అది అంత సులభంగా జరగలేదు. చాలా ఖరీదైన ఆ ఫిలిం ఉత్పత్తి ఆగిపోయి చాలా కాలమే అయ్యింది. షార్ట్ ఫిలిమ్స్ తీసే వాళ్ళు కూడా ఫైవ్ డి కెమెరాలు వాడుతున్న తరుణంలో ఈ రీల్ ను కొనేవాళ్ళు జీరో అయిపోయారు. అందుకే కంపెనీలు తయారు చేయటం కూడా మానేశాయి. కాని రాజీ పడటం ఇష్టం లేని అశ్విన్ వెతికి మరీ ఆ రీళ్ళు పట్టుకొచ్చి పాత కెమెరాతోనే ఆ సీన్లు తీయించాడని తెలిసింది. సహజత్వం కోసం చేసిన ఈ ప్రయత్నం అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చిందని ఇన్ సైడ్ టాక్. తెరమీద చూస్తున్నప్పుడు నిజంగానే సావిత్రి గారి కాలంలో ముందే షూట్ చేసి దాచి ఉంచారా అన్నంత న్యాచురల్ గా ఇవి తెరకెక్కినట్టు టాక్. టీజర్ ఇప్పటికే 3 మిలియన్ల వ్యూస్ దాటేసి సినిమా మీద ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారో చాటి చెబుతోంది. పైగా అన్ని అనుమానాలకు తెర దించుతూ కీర్తి సురేష్ లుక్ సూపర్బ్ రెస్పాన్స్ దక్కించుకోవడంతో అంచనాలు ఇంకా ఎక్కువయ్యాయి. ట్రైలర్ వచ్చాక మహానటి గురించి మరింత అవగాహన వచ్చే అవకాశం ఉంది. మే 9 విడుదలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.