భ్రాంతి మీద స‌ప్త‌గిరి EIGHT కాన్సెప్టే కిర్రాకులే

Update: 2021-11-04 05:30 GMT
మ‌నిషి ఎద‌గాలంటే ఏం చేయాలి?  గొర్రెల మంద‌లో ఒక గొర్రెగా కాకుండా మంద‌ను న‌డిపించే గొర్రెగా ఎద‌గాలంటే ఏం చేయాలి?    వంద‌మందిలో నంబ‌ర్ వ‌న్ అనిపించుకోవాలంటే ఎలాంటి ఎత్తుగ‌డ‌ల‌ను అనుస‌రించాలి?  ఈ పోటీ ప్ర‌పంచంలో ఎలాంటి పోరాటం చేయాలి?  సంఘాన్ని ఎలా డీల్ చేయాలి?

వీట‌న్నిటికీ త‌న‌దైన శైలిలో ఆన్స‌ర్ ఇస్తున్నాడు స‌ప్త‌గిరి. అత‌డు న‌టించిన  EIGHT కాన్సెప్టే కిర్రాకులే అనిపించేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన టీజ‌ర్ ఆద్యంతం స‌ప్త‌గిరి లుక్ ఆహార్యం ఆ పాత్ర తీరు తెన్నులు ప్ర‌తిదీ మైమ‌రిపిస్తున్నాయి. ఈసారి అత‌డు రొటీన్ కి భిన్నంగా వెరైటీ థ్రిల్ల‌ర్ కాన్సెప్టును ఎంచుకుని స‌రికొత్త ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. లేటుగా వ‌చ్చినా నే లేటెస్టుగా వ‌స్తా! అనే ర‌జ‌నీకాంత్ డైలాగ్ లా స‌ప్త‌గిరి కొంత గ్యాప్ త‌ర్వాత ఇస్తున్న ఎంట్రీ మామూలుగా లేదని అర్థ‌మ‌వుతోంది.

అత‌డు న‌టించిన ఇల్యూజ‌న్ (భ్రాంతి) థ్రిల్ల‌ర్ ఎయిట్ అన్ని ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీలోనూ విడుద‌ల‌వుతోంది. తాజాగా దీపావ‌ళిని పుర‌స్క‌రించుకుని తెలుగు-క‌న్న‌డ‌-హిందీ-మ‌ల‌యాళం-త‌మిళంలో టీజ‌ర్ ల‌ను విడుద‌ల చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. టీజ‌ర్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా గ్రిప్పింగ్ గా ఆక‌ట్టుకుంది. పోటీప్ర‌పంచపు భ్రాంతిలో త‌న‌దైన యూనిక్ స్టైల్ తో ఎద‌గాల‌నుకునే ఒక యువ‌కుడి పోరాటాన్ని తెర‌పై ఆవిష్క‌రిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ``క‌నిపించేది నిజం.. వినిపించేది అబ‌ద్ధం.. అంతా భ్ర‌మ‌!`` అంటూ ఇంట్రో ఆక‌ట్టుకుంది. వంద‌మందిలో ఒక్క‌డిగా ఏదోలా బ‌తికేయ‌డం కాదు.. ఒక్క‌డిగా వంద‌మందిలో ఎద‌గాలి! అంటూ సప్త‌గిరి వినిపించిన డైలాగ్ లోనే థీమ్ ఉంది. నొప్పి అనేది పుట్టాలి.. భ‌యం అనేది క‌నిపించాలి!! అప్పుడే ఈ సంఘంలో ఎద‌గ‌గ‌లం అని చెప్పే తీరు ఇంట్రెస్టింగ్.

సప్తగిరి తన తదుపరి ఎయిట్‌ తో పూర్తిగా మేకోవర్ అయ్యాడు. నటుడు సీరియస్ క్యారెక్టర్‌ లో కనిపిస్తాడు. ఇది అతని తొలి పాన్-ఇండియా చిత్రం. దీపావళి కానుకగా ఈరోజు నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమా టీజర్‌ ను విడుదల చేశారు. స్నేహా ఉల్లాల్ .. సోనియా అగర్వాల్ ఈ సినిమాతో తిరిగి కంబ్యాక్ అవుతుండ‌డం ఆస‌క్తిక‌రం. సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అచ్చు సంగీతం అందించారు. రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Full View
Tags:    

Similar News