రామ్ గోపాల్ వర్మ ఈ మద్య కాలం లో తెరకెక్కించిన సినిమాల్లో పెద్ద గా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండానే సాగాయి. ఎక్కువ పాటలు లేకుండా, రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా వర్మ ఈ మద్య కాలం లో సినిమాలను తెరకెక్కించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన దర్శకత్వం లో రూపొందుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ లో మాత్రం పాటలు దండి గా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ మూవీస్ లో రెండు మూడు పాటలు ఉండటమే ఎక్కువ. కాని ఈసారి మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఏకంగా 8 పాటలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.
‘ఎన్టీఆర్’ చిత్రానికి పోటీగా అన్నట్లుగా ఈ చిత్రంను దర్శకుడు వర్మ తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ సినిమాకు కీరవాణి సంగీతాన్ని సమకూర్చితే, లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి మాత్రం కళ్యాణి మాలిక్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం కోసం కళ్యాణ్ మాళిక్ ఏకంగా ఎనిమిది పాటలను ట్యూన్ చేశాడట. అయితే ఈ ఎనిమిది పాటలు కూడా రెగ్యులర్ మాస్ సాంగ్ లా కాకుండా చాలా క్లాసికల్ గా ఉంటాయట. పెద్ద పెద్ద డ్రమ్స్, బీట్లు లేకుండా ఈ పాటలు కొనసాగుతాయని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
సినిమాలోని ప్రతి పాట కూడా సందర్బానుసారంగా వస్తుందని, ప్రతి పాట కూడా ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల మద్య ఉన్న అనుబంధాన్ని, వారి ప్రేమ ను చూపించే విధంగా ఉంటుందట. ఈ చిత్రం లో అంతా కొత్త వారే నటిస్తున్నట్లుగా వర్మ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ కు లక్ష్మీ పార్వతి ఎలా పరిచయం అయ్యింది, ఆ తర్వాత పరిణామాలు ఏంటీ అనే విషయాలను ఎక్కువగా తన సినిమాలో చూపిస్తున్నట్లుగా వర్మ పేర్కొన్నాడు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వర్మ ప్రకటించాడు.