'రానా దగ్గుబాటి..' సరైన క్యారెక్టర్ పడాలేగానీ దాని ఎలివేషన్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రపంచానికి చాటిచెప్పాడు భళ్లాలుడు. రానా సినీ కెరీర్ ను విశ్లేషించాల్సి వస్తే.. బాహుబలి ముందు.. బాహుబలి తర్వాత అని చెప్పుకోవాలి. అంతా భళ్లాల దేవ క్యారెక్టర్ ను పలికించాడు రానా. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ లో నటిస్తున్నాడు.
కాగా.. రానాకు ఈ రోజు వెరీ స్పెషల్. తన మొదటి సినిమా రిలీజ్ అయ్యింది ఇదే రోజున. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లీడర్' రానా తొలి సినిమా. ఈ మూవీ 19 ఫిబ్రవరి 2010న విడుదలైంది. శనివారంతో ఈ సినిమా విడుదలై 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. అందరూ లవ్ తరహా యూత్ సబ్జెక్ట్ తో తెరంగేట్రం చేస్తే.. రానా మాత్రం మొదటి సినిమాతోనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకోవడం విశేషం.
శేఖర్ కమ్ముల తనదైన టేకింగ్ తో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. తన ఫీల్ ను ఈ సినిమాలోనూ కంటిన్యూ చేశాడు. ఇక, మొదటి సినిమా అయినప్పటికీ మంచి ఈజ్ తో నటించి, శెభాష్ అనిపించుకున్నాడు రానా. యంగ్ సీఎంగా అదరగొట్టాడు. ఈ సినిమా తర్వాత ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా నచ్చిన క్యారెక్టర్లు చేస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం తెలుగులోనే కాకుండా.. వివిధ భాషల్లో నటిస్తూ సత్తా చాటుతున్నాడు దగ్గుబాటి వారసుడు.
తాజాగా.. ఆయన సినీ కెరీర్ 11 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా రానా భార్య మిహిక సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో 'లీడర్' సినిమా పోస్టర్‌ను షేర్ చేసిన మిహిక.. 'హ్యాపీ 11 ఇయర్స్.. మై డార్లింగ్ రానా' అని క్యాప్షన్ ఇచ్చింది. అదేవిధంగా.. హోమ్ ప్రొడక్షన్ హౌస్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ కూడా రానాకు ట్విటర్ ద్వారా విషెస్ చెప్పింది. అంతేకాదు.. రానా జర్నీకి సంబంధించిన ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది. దీంతో రానాకు ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.