ఎలిజ‌బెత్ గాల్ గాడోట్ అయినా ఊర్వ‌శి ముందు దిగ‌దుడుపే!

Update: 2021-05-28 00:30 GMT
బాలీవుడ్ హాట్ గాళ్ ఊర్వ‌శి రౌతేలా సోష‌ల్ మీడియాల్లో అసాధార‌ణ ఫాలోవ‌ర్స్ ని క‌లిగి ఉన్న నాయిక‌గా వెలుగుతున్న సంగ‌తి తెలిసిందే.  స‌న్నీలియోన్ ని మించిన ఫాలోవ‌ర్స్ ని ఖాతాలో వేస్తూ స్పీడ్ చూపిస్తోంది ఊర్వ‌శి. ఇన్ స్టాలో రెగ్యుల‌ర్ గా హాట్ ఫోటోల‌ను షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది.

తాజాగా ఊర్వ‌శి ఇద్ద‌రు పాపుల‌ర్ హాలీవుడ్ స్టార్ల‌తో త‌న‌ని తాను పోల్చుకుంది. ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన వెర్సాస్ సేఫ్టీ పిన్ డ్రెస్ లో ఊర్వ‌శి త‌ళ‌త‌ళా మెరిసిపోతోంది. ఇంగ్లీష్ న‌టి ఎలిజ‌బెత్ హార్లీ- ఇజ్రాయేలీ న‌టి గాల్ గాడోట్ లు మాత్ర‌మే ఇలాంటి వైబ్రేంట్ డ్రెస్ ని ధ‌రించారు. ఆ ఇద్ద‌రి ఫోటోల‌తో ఊర్వ‌శి రౌతేలా ఫోటోని జ‌త చేసి సోష‌ల్ మీడియాల్లో అభిమానులు దానిని వైర‌ల్ చేస్తున్నారు. అదే ఫోటోని ఊర్వశి త‌న ఇన్ స్టాలో షేర్ చేసింది.

ఇంత‌కీ సేఫ్టీ పిన్ డ్రెస్ ప్ర‌త్యేక‌త ఏమిటో ఆ ఫోటో చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఈ డ్రెస్ కి ఏకంగా 5-10 పిన్నీసుల‌ను డిజైన‌ర్ జ‌త చేశారు. అవి ఏమాత్రం ప‌ట్టు త‌ప్పినా డ్రెస్ మొత్తం ఓపెన్ అయిపోతుంది. థై స్లిట్.. ఇత‌ర భాగాల్లో స్లిట్ ఎలివేష‌న్ కోసం ఈ పిన్స్ ని ఉప‌యోగించారు.

ఈ ప్ర‌పంచంలో నేను మాత్ర‌మే వ‌న్ అండ్ వ‌న్ ఓన్లీ హాట్ గ‌ర్ల్ అంటూ ఊర్వ‌శి ఇటీవ‌ల హాటెస్ట్ వీడియోని షేర్ చేయ‌గా అది అంత‌ర్జాలాన్ని షేక్ చేసింది. ఫ్యాష‌న్స్ అండ్ ట్రెండ్స్ లో హాలీవుడ్ స్టార్ల‌కే మతి చెడే ట్రీటిస్తున్న ఊర్వ‌శి ప్ర‌స్తుతం సౌత్ లోనూ స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతోంది. గోపిచంద్ సీటీమార్ .. బ‌న్ని పుష్ప చిత్రాల్లో హాట్ ఐటమ్ నంబ‌ర్ల‌తో మెరిపించ‌నుంది.
Tags:    

Similar News