ఫోటో స్టోరీ: బాల్కనీని బీచ్ గా మార్చింది!

Update: 2020-03-20 13:35 GMT
బాలీవుడ్ లో తిష్టవేసిన ఎంతో మంది విదేశీ భామల్లో ఒకరు ఎల్లి అవ్రామ్.  బిగ్ బాస్ షో తో ఇండియాలో అడుగుపెట్టింది ఈ స్వీడన్ భామ.  క్యామియోలు.. స్పెషల్ సాంగ్స్ చేస్తూ బాలీవుడ్లో మంచి గుర్తింపు సాధించింది. ఈ భామ 'నాపేరు సూర్య' సినిమాలో 'ఇరగ ఇరగ' సాంగ్ కు స్టైలిష్ స్టార్ తో కలిసి స్టెప్పులేసింది.  అంతర్జాతీయ అందం కావడంతో హాట్ నెస్ కు ఏమాత్రం లోటు చెయ్యదు.  సోషల్ మీడియాను చెడుగుడు ఆడుకుంటూ ఉంటుంది.

తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు "ఎవరు చెప్పారు.. బికినీ వేసుకుకోవాలంటే బీచ్ అవసరమని. ఇక రేపు అనేది లేదు అన్నట్టుగా నేను నా బాల్కనీ లో ఉంటాను" అంటూ ఓ సూపర్ క్యాప్షన్ ఇచ్చింది.  కరోనా దెబ్బకు అందరూ ఇంట్లో కూర్చుంటున్నారు. బార్లు లేవు.. బీచులు లేవు.. హాలిడే వెకేషన్లు లేవు.  అలా అయితే బికినీలు ధరించే సందర్భం రాదు కదా? ఈ హాటు బుల్లికి కోపం వచ్చిందేమో.. ఆ కోపంతో ఇంట్లోనే బికినీ ధరించి బాల్కనీలో సన్ బాత్ కు సిద్ధమయింది.  ఆ బికినీ అందాలను ఫోటోలలో బంధించి ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. దీనర్థం  ఏంటంటే కరోనా రానివ్వండి దాని ముత్తాతను కూడా రానివ్వండి.. ఎవరు ఏది చెయ్యాలని అనుకుంటారో అది చేసి తీరతారు.  లేకపోతే ఇంట్లో బికినీతో ఈ హాటు పోజులు ఏంటి చెప్పండి?  ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఎల్లి నాజూకుతనం చూస్తే ఎవరైనా డంగైపోవాల్సిందే.

ఇలాంటి ఫోటోలకు ఆటోమేటిక్ గా సూపర్ రెస్పాన్స్ వస్తుంది కదా.  "లక్కీ నెయిబర్స్".. "బీచ్ లు మారుతున్న బాల్కనీలు".. "కరోనా శెలవులు ఇలానా?" అంటూ కొందరు స్పందించారు.  ఎల్లి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'హమ్ మస్తి కరేంగే' అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది.
Tags:    

Similar News