ఎన్టీఆర్ హోస్ట్ గా జెమిని టీవీలో టెలికాస్ట్ అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు కు మంచి రేటింగ్ వస్తోంది. ఈమద్య కాలంలో జెమిని టీవీకి ఎప్పుడు రాని రేటింగ్ ను ఈ షో దక్కేలా చేస్తుంది. వారంలో నాలుగు రోజులు ప్రసారం అవుతున్న ఈ షో వారం వారం రేటింగ్ ను పెంచుకుంటూ పోతోంది. తాజాగా సోమవారం ఎపిసోడ్ లో కొరటాల శివ మరియు రాజమౌళిలు పాల్గొనడంతో ఆ ఎపిసోడ్ కు భారీగా రేటింగ్ వచ్చి ఉంటుంది. ఇక మొదటి ఎపిసోడ్ లో రామ్ చరణ్ పాల్గొనడం వల్ల మంచి రేటింగ్ వచ్చింది. మళ్లీ అంతకు మించిన రేటింగ్ కోసం జెమిని వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎవరు మీలో కోటీశ్వరులు లో మహేష్ బాబు ప్రత్యేక అతిథిగా కనిపించబోతున్నట్లుగా తేలిపోయింది. అందుకు సంబంధించిన పిక్స్ కూడా లీక్ అయ్యాయి. అయితే జెమిని వారు మాత్రం ఇప్పటి వరకు ఆ విషయాన్ని వెళ్లడించలేదు. మహేష్ బాబు మరియు ఎన్టీఆర్ ల పిక్స్ కూడా బయటకు రావడం వల్ల ఖచ్చితంగా వీరిద్దరు కలిసి ఈఎంకే లో సందడి చేయబోతున్నట్లుగా క్లారిటీ వచ్చింది.
ఈ ఇద్దరు స్టార్స్ ఎప్పుడు కలిసి బుల్లి తెరపై కనిపించబోతున్నారు అనేది అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. రకరకాలుగా వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో జెమిని వారి నుండి అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం దసరాకు ఈ ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేయబోతున్నారట. ఒక్క ఎపిసోడ్ లేదా రెండు ఎపిసోడ్ లు టెలికాస్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ తో రెండు ఎపిసోడ్ లను ప్రసారం చేయడంతో రెండు రోజులు కూడా భారీ మొత్తంలో రేటింగ్ వచ్చింది. కాని ఇటీవల ఇద్దరు దర్శకులు వచ్చినప్పుడు మాత్రం కేవలం ఒక్క ఎపిసోడ్ తోనే ముగించారు. ఇక మహేష్ బాబుతో రెండు ఎపిసోడ్ లను ప్లాన్ చేసి రేటింగ్ ను భారీగా పెంచాలనే ఉద్దేశ్యంతో జెమిని వారు ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద వీరిద్దరి స్టామినా ఏంటో అందరికి తెల్సిందే. అందుకే తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు వీరి కాంబో కోసం వెయిట్ చేస్తున్నారు.
దసరా పండుగను డబుల్ చేస్తారు అనే విధంగా షో ను టెలికాస్ట్ చేయబోతున్నారు. టైమ్ ఎప్పటిలాగే ఉంటుందా లేదా సాయంత్రం సమయంలో ప్రత్యేక షో గా టెలికాస్ట్ చేస్తారా అనేది కూడా చూడాలి. ఒక వేళ సాయంత్రం సమయంలో టెలికాస్ట్ చేస్తే రెండు ఎపిసోడ్ లకు అవకాశం ఉండదు. రెగ్యులర్ సమయంలోనే ప్రసారం చేస్తే ప్రేక్షకుల నుండి వచ్చే స్పందన ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి దసరా రోజు కన్ఫర్మ్ కాని టైమ్ ఏంటీ అనేది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. మహేష్ బాబు ఇలాంటి షో లకు చాలా తక్కువగా హాజరు అవుతూ ఉంటారు. కనుక ఆయన్ను ఈ వేదికపై చూడాలని అభిమానులు అంతా కోరుకుంటున్నారు. మహేష్ బాబు తో ఎన్టీఆర్ ఆట ఆడే విధానం ఎలా ఉంటుంది.. మహేష్ బాబు మనసు విప్పి మరీ అన్ని విషయాలను చెప్తారా అనేది చూడాలి.