ఇంగ్లీష్‌ టైటిల్స్‌ నయా ట్రెండ్‌

Update: 2015-08-04 00:34 GMT
సినిమాకి టైటిల్‌ ఎంతో ఇంపార్టెంట్‌. టైటిల్‌ క్యాచీ గా, పడికట్టు పదాలతో, నేటివిటీ టచ్‌ తో ఉంటే జనాల్లోకి దూసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా..టాలీవుడ్‌, కోలీవుడ్‌ లోనే. పొరుగున ఉన్న మలయాళ చిత్ర పరిశ్రమకి వెళ్తే అలాంటిదేమీ ఉండదు. అక్కడ టైటిల్స్‌ అన్నీ ఇంగ్లీష్‌ లోనే ఉంటాయి. టైటిళ్ల విషయంలో హాలీవుడ్‌ తరహా కల్చర్‌ అక్కడ రాజ్యమేలుతోంది.

2015లో రిలీజైన కొన్ని సినిమాల జాబితాని పరిశీలిస్తే ... శాండ్‌ సిటీ, ఎట్‌ వన్స్‌ పికెట్‌ 43, విలేజ్‌ గయ్స్‌, ఫైర్‌ మేన్‌, వైట్‌ బోయ్స్‌, కంపార్ట్‌ మెంట్‌, ఫ్రెండ్షిప్‌, ది రిపోర్టర్‌ .. ఇలా ఉంటాయి టైటిల్స్‌. అంటే ఒకే ఏడాదిలో ఇన్ని టైటిల్స్‌ పూర్తి ఆంగ్ల భాషలో ఉన్నాయంటే అక్కడ టైటిళ్ల విషయంలో నేటివిటీ ప్రయారిటీ లేదనే అర్థమవుతోంది. ఇటీవలి కాలంలో మారిన ట్రెండ్‌ ఇది. మలయాళీలు 99శాతం ఎడ్యుకేటెడ్‌ అని చెబుతారు. కేరళలో విద్యా వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో తులతూగుతోంది. ప్రజల్లో ఆంగ్లంపై అవగాహన కూడా ఎక్కువే. అందుకే ఆంగ్ల టైటిళ్ల పై విమర్శలు కూడా ఉండవు. నేటివిటీ పేరుతో అనవసర రాద్ధాంతం చేయరక్కడ.

అయితే ఇటీవలి కాలంలో టాలీవుడ్‌ లోనూ అప్పుడప్పుడు ఆంగ్ల టైటిల్స్‌ వినిపిస్తున్నాయి. కింగ్‌, బాద్‌ షా, కిక్‌, టెంపర్‌, లోఫర్‌... ఇలాంటి టైటిల్స్‌ అన్నీ జనాల్లోకి సూటిగా దూసుకెళ్లిపోయాయి. ఆయా సినిమాల విజయాల్లో కీలకపాత్ర పోషించాయి. మునుముందు టాలీవుడ్‌ స్టామినా పెరుగుతోంది కాబట్టి ఆంగ్ల టైటిల్స్‌ కి ప్రాధాన్యత పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తమిళంలో మాత్రం ప్రభుత్వం ఆంగ్ల టైటిల్స్‌ పెడితే పన్ను మినహాయింపులు ఇవ్వదు. కాబట్టి అక్కడ అది కుదరదు.
Tags:    

Similar News