ప్రత్యేకం: తారల్లా బీచ్‌లో తిరగాలంటే..

Update: 2015-05-24 01:30 GMT
సన్నీలియోన్‌ బీచ్‌ స్నానాలు చూసో, ఇలియానా గోవా బీచ్‌ స్నానం వీక్షించో అలా చేస్తే బావుణ్ణు అనుకునేరు. ఎంత డబ్బు సంపాదించినా కొందరికి మాత్రమే కొన్ని చెల్లుతాయి. డబ్బుతో పాటు కాలాన్ని కూడా సేవ్‌ చేయగలిగేవాళ్లకు మాత్రమే జీవితంలో అన్ని ఫలాలు అందుతాయి. వేసవి సెలవులకి యాత్రలు వెళ్లడం, బీచ్‌ స్నానాలకు వెళ్లి ఎంజాయ్‌ చేయడం, విదేశీ టూర్‌లు తిరిగి రావడం, హిమాలయాల్లో సాహసయాత్రలు ఇలాంటివన్నీ సాగుతాయి.

ఇలాంటి చోట ఎంజాయ్‌ చేయాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. హన్సిక ఫ్రాన్స్‌లో విహరించిందనో, శ్రీయ అమెరికా బ్యాంకాక్‌ ఎంజాయ్‌ చేసిందనో, ఫలానా స్టార్‌ కాశ్మీర్‌ టూర్‌ వెళ్లాడనో, హిమాలయాలు చుట్టొచ్చాడనో.. ఇలాంటి వార్తలు విన్న యువతరం తాము సైతం అలా చేయగలిగితే అనుకుంటారు. కానీ అదేమీ అంత వీజీ కాదు. సెలబ్రిటీ లైఫ్‌లో ఉన్నంత ఆర్థిక సౌకర్యం సామాన్యులకు కుదురుతుందా? ఈ శికార్లన్నీ ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. సామాన్య, మధ్య తరగతి కుటుంబాల నుంచి ఇలాంటివి ఎంజాయ్‌ చేయాలని ప్రణాళిక వేయాలన్నా భయపడేంత ఖర్చుతో కూడుకున్నవి. సాదాసీదా వ్యవహారాలు కావు ఇవి.

ఖరీదైన ఆలోచనలు వచ్చినప్పుడు సంపాదన కూడా ఆ రేంజులోనే ఉండాలి అంటున్నారు విశ్లేషకులు. ఆర్థికపరమైన వెసులుబాటు ఉన్నప్పుడే ఇవన్నీ. ప్రణాళికా బద్ధంగా డబ్బు సంపాదించేవాళ్లకే ఈ జల్సాలన్నీ అందుబాటులో ఉండేది. అందుకే స్టార్ల లాగే విదేశాలు తిరగాలని, బీచ్‌ స్నానాలు ఆడాలని కలలుగనే మిడిల్‌క్లాస్‌ యువతకు ఇబ్బందులు తప్పవేమో.
Tags:    

Similar News