ట్రైల‌ర్ టాక్: మంచి వాడు రొటీన్ గానే..

Update: 2020-01-08 16:20 GMT
నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్  క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `ఎంత మంచి వాడ‌వురా`. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న  ఈ చిత్రం రిలీజ‌వుతోంది. నేటి సాయంత్రం ప్రీ రిలీజ్ వేడుక హైద‌రాబాద్ లో అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ వేడుక‌లో సినిమా ట్రైల‌ర్ ను ఎన్టీఆర్ ఆవిష్క‌రించారు. ఇక ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ లు తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేష్న‌ ట్రీట్ మెంట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.  శ‌త‌మానం భ‌వ‌తి చిత్రంతో ఫ్యామిలీ డ్రామాని న‌డిపించ‌గ‌లిగే స‌మ‌ర్ధుడిగా ప్రూవ్ అయింది. ఎంత మంచివాడ‌వురా.. ని అంతే మంచివాడిగా చూపించబోతున్నాడు.

ఈ  సినిమా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అంటూ తొలి నుంచి యూనిట్ చెబుతూనే ఉంది. ట్రైల‌ర్ లో ఫ్యామిలీ బంధాలు అనుబంధాల‌ను ఎలివేట్ చేస్తూ.... ఈ సంక్రాంతికి స‌కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ చిత్రమిద‌ని ట్రైల‌ర్ చెబుతోంది. ఫ్యామిలీ ఎమోషన్..యాక్ష‌న్ ని మేళ‌వించి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఒక్కో చోట ఒక్కొక్క బంధం..  అది విడ‌దీయ రాని బంధం.. అంటూ చెబుతున్నారు. క‌ళ్యాణ్ రామ్ పాత్ర‌ను  అంతే ఆస‌క్తిక‌రంగా మ‌లిచారు.

ప్రేమించాల‌ని క‌ళ్యాణ్ రామ్ మెహ‌రీన్ వెంట ప‌డ‌టం... ఎదురించే వాడు రానంత వ‌ర‌కే రా భ‌య‌పెట్టేవాడి రాజ్యం వంటి భారీ డైలాగులు తో పాటు.. పేరుతో పిలిచే దానికంటే బంధుత్వం పిలిచేదానికి ఎమోష‌న్ ఎక్కువ  వంటి సెంటిమెంట్ డైలాగులు కొస‌మెరుపు. ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం లో సాగే స్టోరీ ఇది. క‌ళ్యాణ్ రామ్ డీసెంట్ కుర్రాడిగా గెట‌ప్ బాగా కుదిరింది.  మెహ‌రీన్ స్రీన్ పై బ‌బ్లీగా క‌నిపిస్తోంది. ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ఆహ్లాద‌క‌రంగా ఉన్నాయి. అయితే అంతా బాగానే ఉంది కానీ.. ఇప్ప‌టికే చూసేసిన ఎన్నో సినిమాల్ని త‌ల‌పించేలా .. కాస్త రొటీనిటీ అనేది క‌నిపిస్తోంది. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 15న ప్రేక్ష‌కుల ముందుకు  తీసుకొస్తున్నారు. దీనికి ముందు మ‌రో ఇద్ద‌రు అగ్ర హీరోల చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వాటితో మంచి వాడు పోటీ ప‌డుతున్నాడు.


Full View


Tags:    

Similar News