'మళ్లీ మొదలైంది' ఏంటో ఏమో ఈ జీవితం...

Update: 2021-08-22 12:35 GMT
సుమంత హీరోగా రూపొందుతున్న మళ్లీ మొదలైంది సినిమా ఈమద్య కాలంలో వార్తల్లో తెగ నిలుస్తోంది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ను విభిన్నంగా చేస్తున్నారు. సుమంత మళ్లీ పెళ్లికి సిద్దం అయ్యాడు అంటూ వార్తలు రావడం.. రామ్‌ గోపాల్ వర్మ మొదలుకుని చాలా మంది సుమంత్‌ మళ్లీ పెళ్లి గురించిన మాటలు మాట్లాడటం వల్ల మళ్లీ మొదలైంది సినిమా గురించి జనాలు అందరికి బాగా తెలిసి పోయింది. పెద్ద ఎత్తున అంచనాలు ఆసక్తి ఉన్న ఈ సినిమా నుండి ఏంటో ఏమో ఈ జీవితం అంటూ పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

జీవితం పై విరక్తితో సాగే ఈ పాట లిరిక్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. కృష్ణ చైతన్య రాసిన ఈ పాట పూరి మ్యూజింగ్స్ లో చెప్పే మాటల మాదిరిగా కాస్త కఠువుగా అనిపించాయి. కాని నిజమే కదా అన్నట్లుగా ఉన్నాయి. మొత్తానికి సుమంత ఈ పాటతో మరింతగా మళ్లీ మొదలైంది సినిమాతో ప్రేక్షకులకు చేరువ అయ్యాడు అనడంలో సందేహం లేదు. జీవితం ప్రతి ఒక్కరి సరదా తీర్చుతుంది అన్నట్లుగా సాగే ఈ పాట వింటూ ఉంటే కథ థీమ్ కూడా కాస్త అటు ఇటుగా క్లారిటీ వస్తుంది.

సుమంత హీరోగా ఎన్నో సినిమాలు చేస్తున్నా కమర్షియల్ గా మాత్రం సక్సెస్ లు దక్కించుకోలేక పోతున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన నుండి వస్తున్న ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నేపథ్యంలో మళ్లీ మొదలైంది ఒక మంచి కాన్సెప్ట్‌ మూవీగా నిలుస్తుందనే నమ్మకం కూడా వ్యక్తం అవుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఏంటో ఏమో ఈ జీవితం సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. విడుదల అయిన వెంటనే మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. సుమంత పాట ఇంత తక్కువ సమయంలో అంతగా వ్యూస్ ను దక్కించుకోవడం అరుదుగా చెప్పుకోవచ్చు. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ఉంది.


Full View
Tags:    

Similar News