గాడ్ ఫాదర్ కలెక్షన్లలో ఆ యాంగిల్ మిస్

Update: 2022-10-13 04:33 GMT
వేరే భాషలో హిట్ అయిన సినిమాను రీమేక్ చేయటం రోటీన్ గా జరిగేదే. కానీ.. వేరే భాషా చిత్రం తెలుగులోకి డబ్ అయి.. సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత రీమేక్ చేయాలనుకోవటం పెద్ద సాహసమే అవుతుంది. అలాంటి పనే చేశారు మెగాస్టార్ చిరంజీవి. మోహన్ లాల్ మలాయళంలో నటించిన లూసిపర్ మూవీ తెలుగులో కూడా అదే పేరుతో విడుదల కావటం తెలిసిందే. కరోనా కారణంగా.. ఇతర భాషా చిత్రాల్ని సైతం.. సబ్ టైటిల్స్ ను ఫాలో అవుతూ సినిమాలు చూసే వారి సంఖ్య భారీగా పెరిగింది.

ఇంట్లోనే కూర్చొని.. కదలకుండానే బోలెడన్ని సినిమాలు చేతి వేలి కొసకు అందుబాటులో ఉన్న వేళలో.. వాటన్నింటిని విడిచిపెట్టి.. థియేటర్ కు రావటం అంటే మాటలు కాదు.

అందునా.. మలయాళంలోనూ.. తెలుగులోనూ విడుదలైన మూవీని మరోసారి రీమేజ్ చేయటం అంటే మాటలు కాదు. అలాంటి సాహసానికి తెర తీశారు మెగాస్టార్. అలా తీసిన గాడ్ ఫాదర్ దసరా కానుకగా థియేటర్లలో సందడి చేసింది. అంచనాలకు తగ్గట్లే ప్రేక్షకులు వచ్చారు. ఈ సినిమా విడుదలకు రెండు.. మూడు రోజుల ముందు మణిరత్నం పొన్నియిన్ సెల్వం -1 మూవీ రిలీజ్ కావటం తెలిసిందే. గాడ్ ఫాదర్ వసూళ్లు కాస్తంత తక్కువగా ఉన్నాయంటే.. ఆ సినిమా కూడా కారణమని చెబుతారు కానీ.. అసలు విషయాన్ని చాలామంది మిస్ అయ్యారు.

పొన్నియిన్ సెల్వం మూవీ టికెట్ హైదరాబాద్ మల్టీఫ్లెక్సుల్లో 295 రూపాయిలు. అదే గాడ్ ఫాదర్ మూవీ టికెట్ రూ.195 మాత్రమే. ఇటీవల కాలంలో స్టార్ సినిమాలు భారీ ధరలు పెట్టటం.. దాని కారణంగా కలెక్షన్ల మీద ప్రభావం పడటం తెలిసిందే. పొన్నియిన్ సెల్వం వర్సస్ గాడ్ ఫాదర్ మూవీలను చూసినప్పుడు ఒక డబ్బింగ్ మూవీ టికెట్ కంటే చిరు తన సినిమా టికెట్ ను తక్కువ ధరకు అమ్మేందుకు ఓకే చెప్పటం కనిపిస్తుంది.

నిజానికి ఇదో అరుదైన సందర్భం. ఒక అగ్ర హీరో నటించిన సినిమా టికెట్ కంటే.. ఒక డబ్బింగ్ మవీ టికెట్ ఎక్కువగా ఉండటం మామూలు విషయం కాదు. పొన్నియిన్ సెల్వం బడ్జెట్.. తారాగణం.. దాని మీద ఉన్న అంచనాలు లాంటివి ఎన్ని ఉన్నా.. ఒక స్ట్రెయిట్ సినిమా.. అందులోనే అగ్ర హీరో సినిమా టికెట్ ధర కంటే ఎక్కువ ఉండటం రేర్ మూమ్ మెంట్ అని చెప్పాలి. గాడ్ ఫాదర్ విషయానికి వస్తే.. అనుకున్నంతగా టికెట్లు తెగ లేదు.

దీనికి కారణం.. ఈ మూవీ ఒరిజినల్ ను ఇప్పటికే మూడు నాలుగు సార్లు చూసినోళ్లు ఉన్నారు. అలాంటి వారు ఈ సినిమాను మిస్ చేశారని చెప్పాలి. ఇక.. కలెక్షన్లు ఆశించినంత రాలేదన్న మాట ఉంటే.. దాని వెనుక టికెట్ల ధరలు తక్కువగా కూడా ఉండటం ప్రధాన కారణంగా చెప్పాలి. అదే సమయంలో.. సీనిమాకు ఈ మాత్రం కలెక్షన్లు.. టికెట్ ధర తక్కువగా ఉండటం కూడా కీ రోల్ ప్లే చేసిందని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News