ఫోటో స్టోరీ: నేను క్వినోవా అంటున్న ఈషా

Update: 2020-04-19 03:30 GMT
సోషల్ మీడియాలో మంటలు పెట్టే హాటు భామలు చాలామంది ఉంటారు.  అలాంటి భామలలో ముంబై భామ ఈషా గుప్తా ముందు వరుసలో సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ నిలుచుని ఉంటుంది.  ఇప్పటికి ఈ భామ దాదాపు 15 సినిమాల్లో నటించి హిందీ ప్రేక్షకులను మెప్పించింది. ఇక తన హాటు ఫోటోలతో నెటిజన్లను రోజూ మెప్పిస్తూనే ఉంది.  ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉంది కదా దీంతో ఇంట్లోనే ఉంటూ కత్తి లాంటి ఫోటోలను చేసే కార్యక్రమం చేపట్టింది.

తాజాగా ఈషా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు "ఏం తింటారో అదే మీరు.. హాయ్, నేను కొర్రని" అని క్యాప్షన్ ఇచ్చింది. కొర్ర అంటే అదేదో కర్ర అనుకోకండి.  ఈమధ్య డైటింగ్ తత్వవేత్తలు విపరీతంగా లాగిస్తున్న కొర్రలు అనే ధాన్యమే. మరొకటి కాదు.  మరి ఈ విషయం చెప్పేందుకు కోటి వోల్టుల షాక్ ఇచ్చే వస్త్ర ధారణతో అద్దం ముందు నిలబడి పోజిచ్చింది.  భామ నాజూకు కాబట్టి కొర్ర అనుకోవచ్చు.. ఎర్రగా బుర్రగా ఉందని కూడా మన మనసుకు సున్నితంగా సర్ది చెప్పుకోవచ్చు.  ఇదే ఫోటోను ఎవరైనా వుహానువాసి కనూక చూస్తే "ఏం తింటారో అదే మీరు. నేను గబ్బిలాన్ని" అనకుండా ఉండలేడు.

ఈ ఫోటోకు జనాలు కత్తిలాంటి కామెంట్లు పెట్టారు.  "నీ హాట్ నెస్ కు కరోనా పారిపోతుంది".. "కలర్ కొర్ర కావాలి".. "నువ్వు క్వినోవా నేను బనానా" అంటూ కొందరు ఇంట్రెస్టింగ్ కామెంట్లతో తమ స్పందన తెలిపారు.  ఇక ఈషా ఫ్యూచర్ సినిమాల విషయానికి వస్తే 'దేశి మ్యాజిక్' అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది.



Tags:    

Similar News