ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలతో ఓటీటీ కంటెంట్ మంటలు పెట్టేస్తున్న సంగతి తెలిసిందే. ఓటీటీకి సెన్సార్ షిప్ అడ్డంకులేవీ లేకపోవడంతో చెలరేగి నటించేందుకు ఆర్టిస్టులు అడ్డు చెప్పడం లేదు. ఎంతగా ఆవిరులు పుట్టిస్తే అంతగా ఆదరణ దక్కుతోంది. ఇక రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో తెరకెక్కిన ఆశ్రమం సిరీస్ అంతే సంచలనాలు సృష్టిస్తోంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ జంట చెలరేగిన తీరు ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
ఆశ్రమం వెబ్ సిరీస్ రెండు సీజన్లు హీటెక్కించింది. ప్రస్తుతం ఆశ్రమం 3 అంతే సంచలనంగా మారింది. బాబీ డియోల్- ఈషా గుప్తా లాంటి సీనియర్ జంట నటించిన `ఆశ్రమ్ 3` ప్రస్తుతం మాస్ లో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తోంది. ఆ ఇద్దరి నడుమా ఘాటైన రోమాంచిత సన్నివేశాలు ఆవిరులు పుట్టిస్తున్నాయి. రెండు సీజన్ల తర్వాత ప్రకాష్ ఝా మూడవ సీజన్ ని అంతే రక్తి కట్టించేలా తెరపైకి తీసుకు వచ్చారని ప్రశంసలు కురుస్తున్నాయి. బాబీ డియోల్ `ఆశ్రమం 3`లో సాధువుగా తన అద్భుతమైన నటనతో మరోసారి మెప్పించాడు. ఈ షోకి హాటెస్ట్ ఈషా గుప్తా ప్రధాన ఆకర్షణగా మారింది. సిరీస్ ఎపిసోడ్ లో సోనియా పాత్రను ఆమె పోషించారు. ఇషా పాత్ర స్వభావం మేరకు బాబా డియోల్ కి దగ్గరవ్వాలి. అంతేకాదు.. బాబీ డియోల్ ని టెంప్ట్ చేయడానికి ఈ సీనియర్ బ్యూటీ హాట్ గా హొయలొలికిస్తూ ఎత్తుగడలు వేస్తుంది.
ఇది ఆశ్రమం 3 సీజన్ ఐదవ ఎపిసోడ్ లో వచ్చే సీన్. ఈషా గుప్తా ఒక పాట సమయంలో తన క్లాసిక్ కదలికలను ప్రదర్శిస్తూ వేడెక్కిస్తుంది. పింక్ రంగులో మెరిసిపోయే దుస్తులను ధరించి ఈషా గుప్తా టూ హాట్ లుక్ తో కనిపించింది. ఈ జంట రొమాన్స్ ఇంటర్నెట్ ను షేక్ చేసింది. సాధువుతో రొమాన్స్ లో ఇషాజీ అదరగొట్టింది. ఈ ఎపిసోడ్ లో బాబీ డియోల్ దృష్టిని అత్యంత అద్భుతమైన రీతిలో ఆకర్షించేందుకు ఈషా గుప్తా తన యోగా భంగిమలను ప్రదర్శించడం కనిపిస్తుంది. ఈ పాట సీజన్ 3లోని హైలైట్ లలో ఒకటిగా నిలిచింది. ఈషా గుప్తా -బాబీ డియోల్ నడుమ హీట్ పెంచే దృశ్యానికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రముఖ వెబ్ సైట్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈషా గుప్తా ఇలాంటి ఘాటైన సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందుకు అసౌకర్యంగా ఫీలయ్యారా? అని ప్రశ్నిస్తే.. దానికి సరైన జవాబిచ్చారు. మీరు పరిశ్రమలో 10 సంవత్సరాలు పనిచేసినప్పుడు సౌకర్యంగా లేదా అసౌకర్యంగా ఉండటం గురించి ఎలాంటి పట్టింపు ఉండదు. ప్రజలు సాన్నిహిత్యం రొమాన్స్ ని ఒక సమస్య అని అనుకుంటారు. కానీ అది మీ నిజ జీవితంలో సమస్య అయితే తప్ప.. తెరపై కనిపించే దానిని అలా ఊహించుకోవద్దు. మేము దాని గురించి చాలా ఓపెన్ గా ఉన్నాం. మనం ఆ సమయంలో ఏడ్చినా.. ఇంకేదైనా చేసినా ప్రతి సన్నివేశం కష్టంగానే ఉంటుంది. నేను కెరీర్ ఆరంభంలో మొదటిసారి చేసినప్పుడు షూట్ చేయడం చాలా కష్టమై ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఇంతగా పరిణతి చెందిన తర్వాతా.. మన చుట్టూ ఉన్న మంచి నటులతో షూటింగ్ చేస్తున్నప్పుడు ఇంకా అలా అనుకోవాలా? వారితో ఏ సమస్యా ఉండదు.. అని తెలిపారు.
ఇలాంటి ఘాటైన సన్నివేశాల్లో నటించడంపై బాబీ డియోల్ స్పందన ఎలా ఉంది అని తననే ప్రశ్నించగా.. ఇషా జీ మాట్లాడుతూ.. ``బాబీ ఇంతకు ముందు తన జీవితంలో కూడా ఇలా సన్నిహితంగా ఉండేవాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అతను ఇలాంటి సన్నివేశాలకు ఓకే అని నేను అనుకుంటున్నాను. తెరపై కామాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కామం కనిపించేలా చూసుకోవాలి. మీరు ప్రేమను చూపించాల్సి వచ్చినప్పుడు తెరపై ప్రేమ మాత్రమే కనిపించేలా చూసుకోవాలి... కానీ కామం కాదు. కాబట్టి మనం ఏ సీన్స్ చేసినా జస్టిఫై చేయగలమని ఆశిస్తున్నాను.. అని ఇషా జీ వివరణ ఇచ్చారు. ఇషా గుప్తా ఇంతకుముందు `వినయ విధేయ రామా` చిత్రంలో ఐటమ్ నంబర్ లో నర్తించిన సంగతి తెలిసిందే. ఇటీవల తెలుగు సినీపరిశ్రమ నుంచి ఆఫర్లు ఏవీ లేవు. బాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తోంది.