చెర్రీ ఫ్యాన్ కు పేమెంట్ నచ్చలేదటగా..

Update: 2016-08-31 15:30 GMT
ఒక ప్రముఖ ఇంగ్లీష్‌ దినపత్రిక.. టాలీవుడ్ లోకి వస్తున్న ఈషా గప్తా అంటూ అమ్మడి గురించి ఒక పెద్ద కథనమే ప్రచురించింది. మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీట్ గెలుచుకున్న ఈ 30 ఏళ్ల హాటీ.. హిందీలో పలు సినిమాలు చేస్తంది కాని.. ఒక్కటి కూడా ఆమెను స్టార్ హీరోయిన్ గా ప్రొజెక్టు చేయట్లేదు. అందుకే నేను రామ్‌ చరణ్‌ కు ఫ్యాన్ అయిపోయా అంటూ ఎప్పటినుండో తెలుగులో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తోంది.

కట్ చేస్తే.. స్వామి రారా ఫేం సుధీర్ వర్మ ఇప్పుడు నిఖిల్ తో చేయబోయే కొత్తసినిమాలో అమ్మడికి ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ చేసే ఛాన్సొచ్చిందని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈమె సెక్సీ కటౌట్ కు పోలీస్ ఆఫీసర్ రోల్ చాలా బాగుంటుందని సినిమా లవర్స్ కూడా ఫీలయ్యారు. కాని మ్యాటర్ ఏంటంటే.. ''అసలు ఏం సినిమా అది? నాకు తెలియను కూడా తెలీదే? నేనేం అలాంటి సినిమా చేయట్లేదు'' అంటూ అమ్మడు ట్వీటేసింది.

ఇంతకీ విషయం ఏంటా అని ఆరాతీస్తే.. అమ్మడు చేసేది చిన్నరోల్ అయినా కూడా ఒక రకుల్ ప్రీత్ రేంజులో పేమెంట్ అడిగిందట. బాలీవుడ్ లో అంటే అలాంటి పేమెంట్లు ఇచ్చినా గిట్టుబాటు అవుతుంది కాని.. టాలీవుడ్ లో అంతేసి పేమెంట్లు ఇవ్వమంటే కష్టం కదా. అందుకే ఇప్పుడు తెలివిగా అసలు నేను ఆ ప్రాజెక్టు గురించే వినలేదే అనేసింది. పరిణీతి చోప్రా కూడా అంతేగా.. మహేష్‌ సినిమా గురించి నన్ను అడగలేదు అంది.. కట్ చేస్తే.. ఆమె డేట్స్ ఇవ్వలేదు అంటూ మురుగుదాస్ చెప్పేశాడు. ప్చ్.

Tags:    

Similar News