యూట్యూబ్ లో దేత్తడి ఛానెల్ తో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన అలేఖ్య హారికకు బిగ్ బాస్ సీజన్ 4 లో ఆఫర్ రావడం.. అందులో ఏకంగా ఫైనల్ 5 వరకు వెళ్లడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. యూట్యూబ్ స్టార్ కాస్త సినిమా స్టార్ అవ్వడం ఖాయం అంటూ అంతా భావించారు. కాని బిగ్ బాస్ నుండి బయటకు వచ్చి నెలలు గడుస్తున్నా కూడా ఆమె సినిమాలు ప్రకటించక పోవడంతో ఆమె కు ఆఫర్లు రావడం లేదేమో అని అంతా అనుకున్నారు. యూట్యూబ్ వీడియోలు కూడా తగ్గడంతో హారికపై కొందరు విమర్శలు చేశారు. కనీసం యూట్యూబ్ వీడియోలు అయినా రెగ్యులర్ గా చేయాలంటూ సూచించారు. ఇన్నాళ్లు ఎలాంటి కామెంట్స్ వస్తున్నా సైలెంట్ గా ఉన్న దేత్తడి హారిక ఒకేసారి రెండు ప్రాజెక్ట్ లను ప్రకటించి అందరిని ఆశ్చర్యపర్చింది.
హారిక ఇటీవల ఒక స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈమె వెబ్ సిరీస్ ను కూడా చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. వెబ్ సిరీస్ ఎప్పటికి మొదలు అవుతుందో అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఆ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ను దేత్తడి హారిక విడుదల చేసింది. 'ఏవండోయ్ ఓనర్ గారు' అనే టైటిల్ తో హారిక వెబ్ సిరీస్ ను చేస్తుంది. షూటింగ్ దాదాపుగా ముగిసిందని త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్దం అవుతుందని సమాచారం అందుతోంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో అఖిల్ రాజ్ తో ఈమె రొమాన్స్ చేస్తుంది.
ఏవండోయ్ ఓనర్ గారు ఫస్ట్ లుక్ చూస్తుంటే ఈ వెబ్ సిరీస్ లో దేత్తడి హారిక డామినేషన్ క్లీయర్ గా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఈ అమ్మడు చేస్తున్న హడావుడితో ఖచ్చితంగా ఆ వెబ్ సిరీస్ కు మంచి పబ్లిసిటీ అయితే దక్కడం ఖాయం అంటున్నారు. ఏవండోయ్ ఓనర్ గారు టైటిల్ లోనే కాస్త ఎంటర్ టైన్ మెంట్ కనిపిస్తుంది. కనుక వెబ్ సిరీస్ ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లోని పలువురు కంటెస్టెంట్స్ సినిమాలతో బిజీ అవుతున్న ఈ సమయంలో దేత్తడి హారిక కూడా సినిమాలు మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అయ్యింది. త్వరలో సినిమాల్లో ఈమె మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.