ఎవరో ఎవరో.. అంటున్న కల్కి!

Update: 2019-06-23 07:55 GMT
యాంగ్రీ స్టార్ డా.రాజశేఖర్ హీరోగా.. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న చిత్రం 'కల్కి'.  ఇప్పటికే ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ సినిమాను జూన్ 28 న రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ సమయం తక్కువ ఉండడంతో 'కల్కి' టీమ్ తమ ప్రమోషన్స్ లో జోరు పెంచారు.  తాజాగా ఈ సినిమానుండి 'ఎవరో ఎవరో' అంటూ సాగే లిరికల్ సింగిల్ ను విడుదల చేశారు.

ఈ సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ సంగీత దర్శకుడు.  ఈ పాటకు సాహిత్యం అందించిన వారు కృష్ణకాంత్(KK).  సాఫ్ట్ మెలోడీగా సాగే ఈ పాటను ఆలపించినవారు హేమచంద్ర.. శ్వేతా మోహన్.  "ఎవరో ఎవరో ఎవరో అతగాడెవరో ఎపుడో ఎక్కడో తెలిసే గురుతతనెవరో వెతికేలోపే వెనకే నిలిచిందెవరో ఎదురై కలిసి నడకే కలిపిందెవరో" అంటూ ఎంతో ఆహ్లాదంగా ఉండే పదాలతో మనసుకు హాయిగొలిపేలా సాగింది సాహిత్యం.  ఈ లిరిక్స్ కు తగ్గట్టే ఎంతో మెలోడియస్ ట్యూన్ అందించారు శ్రవణ్.  దానికి మించి అన్నట్టుగా శ్వేత.. హేమ చంద్ర ఈ పాటను సాఫ్ట్ గా పాడారు.  మెలోడీ పాటలు ఇష్టపడేవారికి తెగ నచ్చేలా ఉంది.  "ఆరారా నాకు ముక్కా నాకు ముక్కా నాకు ముక్క" బ్యాచ్ కు మాత్రం మింగుడు పడడం మాత్రం కష్టమే.. ఎందుకంటే పాట స్లోగా ఉంది!

ఈ సినిమాలో రాజశేఖర్ కు జోడీగా అదా శర్మ నటిస్తోంది. నందితా శ్వేత.. పూజిత పొన్నాడ.. రాహుల్ రామకృష్ణ.. నాజర్.. అశోతోష్ రాణా.. శత్రు ఇతర కీలకపాత్రల్లో నటించారు.  ఈ సినిమాను సీ. కళ్యాణ్.. శివాని.. శివాత్మిక నిర్మిస్తున్నారు.


Full View

Tags:    

Similar News