MEK:రాంచరణ్ కు చమటలు పట్టించిన ప్రశ్నలివే

Update: 2021-08-23 17:30 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రారంభమైన ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ షో ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి షో కు టాలీవుడ్ అగ్రహీరో రాంచరణ్ గెస్ట్ గా వచ్చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. దీంతో ఆ అనుబంధం ఎపిసోడ్ లో స్పష్టంగా కనిపించింది.

రాంచరణ్ తాజాగా ఎన్టీఆర్ వేసిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మధ్యలో చిరంజీవిని, పవన్ కళ్యాణ్, అలాగే ఆరెంజ్ సినిమాను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా రాంచరణ్ ను తికమక పెడుతూ ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలు ఆసక్తి రేపాయి.

* ఎన్టీఆర్ ఈ షో రాంచరణ్ ముందుంచిన ప్రశ్నలు, జవాబులు ఇవే..

1. గురువు అనే అర్థం కలిగిన పదం ఏదీ?
జవాబు: ఆచార్య
2.హిందూ పురాణాల్లో ఏది తాగడం వల్ల అమరత్వం వస్తుంది?
జవాబు: అమృతం
3.ఎస్ఎల్ఆర్, డిఎస్ఎల్ఆర్, ఇన్స్ టాంట్ అనేవి దేనిలో రకాలు
జవాబు : కెమెరాలు
4.ఆడియో క్లిప్ పాట విని పై గాయకుడు ఎవరన్న ప్రశ్నకు..?
జవాబు : పవన్ కళ్యాణ్
5.వీటిలో క్రికెట్ లో ఒక ఫీల్డింగ్ పొజిషన్ కానిది ఏదీ
జవాబు: వింగ్ బ్యాక్
6. ఓపెరా హౌస్ బొమ్మ ఏ దేశంలో ఉంది?
జవాబు: సిడ్నీ
7. PETA సంస్థ వీటిలో దేనికి సంబంధించినది?
జవాబు: జంతువుల హక్కులు
8. తెలంగాణలో ఒక జిల్లాకు పేరు పెట్టిన విప్లవ వీరుడు ఎవరు?
జవాబు: కొమురం భీమ్

ప్రశ్నల మధ్యలో చిరంజీవి, పవన్, రాజమౌళి గురించి, ఆర్ఆర్ఆర్ లో తమ పాత్రల గురించి ఎన్టీఆర్, రాంచరణ్ లు గుర్తు చేసుకున్నారు. రాజమౌళి తీసిన సన్నివేశాలు విజువల్ ట్రీల్, తెరమీదన సీన్స్ ను చింపేశఆడు అని ఆర్ఆర్ఆర్ పై ఆసక్తి పెంచేలా మాట్లాడారు.




Tags:    

Similar News