వైష్ణవ్ తేజ్ - రకుల్ జంటగా క్రిష్ దర్శకత్వంలో 'కొండ పొలం' సినిమా రూపొందింది. సాయిబాబు - రాజీవ్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. కొండప్రాంతంలోని గిరిజనుల జీవితానికి సంబంధించిన కథ ఇది. అడవిలో బతకడం కూడా కష్టమైపోయినప్పుడు ఒక గిరిజన యువకుడు ఏం చేశాడు? తమకి ఎదురైన కష్టాలను ఎదిరించి ఎలా నిలబడ్డాడు? అనే అంశం చుట్టూ ఈ కథ నడుస్తుంది. అడవిని నమ్ముకున్నవారి జీవితాల్లోని సమస్యలను స్పర్శిస్తూనే, అక్కడి అందమైన ప్రేమకథను ఆవిష్కరించారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారు.
ఈ సినిమాకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ ను ఇటీవల 'కర్నూల్' లో నిర్వహించారు. ఈ వేదిక ద్వారా ఈ సినిమాకి సంబంధించిన మొత్తం పాటలను ఆవిష్కరించారు. ఈ ఏడు పాటలను 'జ్యూక్ బాక్స్'లా అందించారు. ఈ పాటలను ఒకదాని తరువాత ఒకటిగా వరుసగా వింటూ వెళితే కథ అర్థమైపోతుంది. అదే ఈ పాటల ప్రత్యేకతగా భావించవచ్చు. ఇక ఏ పాటకు ఆ పాట ఎంతో ప్రత్యేకతను కలిగినవిగా అనిపిస్తాయి. సినిమా చూడకపోయినా, ఆ పాటలు తెరపై ప్రత్యక్షమయ్యే సందర్భాలు అర్థమైపోతాయి.
'ఓబులమ్మా.. ' అనే పాటను కీరవాణి రాయడం విశేషం. నాయకా నాయికలు ఒకర్తిపై ఒకరు తమ ప్రేమను అందంగా ఆవిష్కరించే పాట ఇది. " కంటికేమో కునుకు దూరపు చుట్టమాయే .. గుండెలోన నీ పేరు జపమాయే" అవంతి పద ప్రయోగాలు కీరవాణి చేయడం విశేషం. 'ఓ ఓబులమ్మా .. అంటూ హృదయం లోతుల నుంచి వచ్చే ఆలాపన .. మనసుపై మంత్రంలా పనిచేస్తుంది. యామిని - రోహిత్ ఆలపించిన ఈ పాట, ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక మధురమైన పాటగా దీనిని గురించి మనం చెప్పుకోవచ్చు.
ఇక 'తల ఎత్తు'.. అంటూ సిరివెన్నెల రాసిన పాట .. చైతన్య భరితంగా సాగుతుంది. నిద్రమత్తును వదిలించి .. వెన్నుతట్టి ముందుకు నడిపించడంలో సిరివెన్నెల సిద్ధహస్తుడు. ఈ తరహా పాటల్లో ఆయన అక్షరాలు నిప్పుకణికల్లా అనిపిస్తాయి. 'ముప్పును ముంచే ఉప్పెన ..' .. 'అలసిందా .. ఎగసిందా అల, అల లాంటిది కాదా నీ తల' వంటి ప్రయోగాలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి .. కొండంత ధైర్యాన్ని గుండె గదుల్లోకి పంపుతూ ఛాతీని విశాలం చేస్తాయి. కీరవాణి .. హారిక నారాయణ .. సౌమ్య వారణాసి ఈ పాటకు ప్రాణం పోశారు.
'ధమ్ ధమ్ ధమ్' అనే పాటను చంద్రబోస్ రాయగా, రాహుల్ సిప్లి గంజ్ బృందం ఆలపించింది. అడవిని మించిన గుడి లేదు .. అడవిని మించిన బడి లేదు .. అడవి అన్ని పాఠాలు నేర్పుతుంది' అనే అర్థంలో రాయబడిన ఈ పాట హుషారుగా సాగుతుంది. అడవిని పెనవేసుకుపోయిన జీవితాలను .. వాళ్ల ఆలోచనలను కళ్లకు కడుతుంది. ఇక 'కథలు కథలుగా' అనే పాటను కైలాశ్ ఖేర్ - యామిని ఘంటసాల ఆలపించారు. కీరవాణి సాహిత్యాన్ని అందించిన ఈ పాట, అడవిని ఆశ్రయించినవారిని ఓదార్చుతూ .. ఓర్పుతో ముందుకు సాగమని చెబుతూ మనసును తడి చేస్తుంది.
'దారులు దారులు దారులు' అనే పాట మాత్రం మంచి ఊపుతో .. ఉత్సాహంతో నడుస్తుంది. సిరివెన్నెల కలం నుంచి జాలువారిన ఈ పాట, బతకడానికి భయపడటం కాదు .. భయపెడుతూ బతికేయాలి అనే అర్థంలో పరుగులు తీస్తుంది. 'చావో రేవో తేల్చేవరకూ ఆగకన్న పొలిమేరలు' అనే పంక్తి, పోరాటపటిమను పెంచేదిగా కనిపిస్తుంది. కీరవాణి - హారిక నారాయణ తమ గానంతో ఈ పాటను నిలబెట్టేశారు. ఇక ఈ మధ్య కాలంలో వచ్చిన బ్యూటిఫుల్ మెలోడీగా 'శ్వాసలో .. ' పాట కనిపిస్తుంది. కీరవాణి బాణీ కొత్తగా అనిపిస్తుంది .. ఆయన స్వరపరిచిన ఈ పాటను యామిని ఘంటసాల - రోహిత్ అద్భుతంగా ఆలపించారు. అమృతంలో తేనె కలుపుకుని తగినట్టుగా అనిపించే పాట ఇది.
'చెట్టెక్కి పుట్టతేనె పట్టి తెచ్చామావ .. లొట్టెసి జుర్రుకుంటావా' అనే పాటను కాలభైరవతో కలిసి శ్రేయా ఘోషల్ ఆలపించింది. చంద్రబోస్ తన కలంతో పదాల గారడీ చేశాడనే చెప్పాలి. పదాలను పంచదార చిలకల్లా విరుస్తూ సాగే ఈ బీట్ గమ్మత్తుగా అనిపిస్తూ ఆకట్టుకుంటుంది. శ్రేయా ఘోషల్ కోకిల కంఠం ఈ అడవి నేపథ్యంలో సాగే కథకి వసంతం తెచ్చినట్టుగా అనిపిస్తుంది. పాటల పరంగా చెప్పాలంటే 'కొండ పొలం' కోటి అనుభూతుల ఫలం అని చెప్పుకోవచ్చు.