తెలుగు చిత్ర పరిశ్రమలో సమస్య వచ్చినప్పుడల్లా 'ఇండస్ట్రీ పెద్ద' అనే మాట వింటూ ఉంటాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల తగ్గింపు వ్యవహారం మీద రచ్చ జరుగుతుండటంతో.. ఈ అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. అయితే ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండాలనుకోవటం మూర్ఖత్వమని.. ఆ టైటిల్ ఉన్నంత మాత్రాన మాట వినేవారు ఎవరూ లేరని విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘Rx 100’ ఫేమ్ అజయ్ భూపతి ట్విట్టర్ వేదికగా ''మా బాస్ ( రాంగోపాల్ వర్మ ) ని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చూడాలని నా కోరిక... సామీ మీరు రావాలి సామీ'' అని కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆర్జీవీ స్పందిస్తూ ''అజయ్ గారూ.. ఇండస్ట్రీ వాళ్ళకి పెద్ద దిక్కు ఉండాలనుకోవడం మూర్ఖత్వం.. ఎందుకంటే, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వాడికీ వేరే వేరే స్వార్థాలు ఉంటాయి.. దాని మూలాన వాడికి మాత్రమే పనికొచ్చే మాటే ప్రతివాడు వింటాడు కానీ.., ఎవడికో పెద్దదిక్కు అని టైటిల్ ఇచ్చినంత మాత్రాన వాడి మాట ఎవ్వడూ వినడు'' అని ట్వీట్ చేశారు.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తనకు ఇండస్ట్రీ పెద్దరికం హోదా వద్దని.. ఒక బాధ్యత గల బిడ్డగా అందరికీ అందుబాటులో ఉంటానని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా టికెట్ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే తన గురువు ఆర్జీవీని ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా చూడాలనే కోరికను అజయ్ భూపతి బయటపెట్టారు.
వర్మ మాత్రం ఇండస్ట్రీలో అందరూ స్వార్థపరులే అని.. పెద్దదిక్కు అనే టైటిల్ ఉన్నా మాట వినరని.. అలాంటి వారికి పెద్దగా ఉండాలనుకోవడం మూర్ఖత్వం అని అభిప్రాయపడ్డారు. అయితే ఏపీలో సినిమా టికెట్ ధరల విషయంలో ఇండస్ట్రీ తరపున ప్రభుత్వంతో మాట్లాడటానికి రామ్ గోపాల్ వర్మ సిద్ధమయ్యారు. ప్రభుత్వం అనుమతిస్తే టాలీవుడ్ సమస్యలకి సంభందించిన వివరణ ఇస్తానని విజ్ఞప్తి చేశారు.
గత కొన్ని రోజులుగా ఈ ఇష్యూ మీద సోషల్ మీడియా - మీడియా ఇంటర్వ్యూల ద్వారా ప్రభుత్వం మీద ఆర్జీవీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఏపీ మంత్రి పేర్ని నాని - వర్మ మధ్య ట్వీట్ వార్ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవాలి అన్నది తమ ఉద్దేశం కాదని.. కేవలం సమస్యలను సరిగా చెప్పలేకపోవడం వల్లనో.. లేక మీరు అర్థం చేసుకోకపోవడం వల్లనో ఈ మిస్ అండర్ స్టాండింగ్ ఏర్పడిందని అన్నారు. అందుకే స్వయంగా వీటి గురించి వివరిస్తానని.. ఆ తర్వాత ప్రభుత్వపరంగా ఆలోచించి సరైన పరిష్కారం ఇస్తారని ఆశిస్తున్నానని ఆర్జీవీ అన్నారు. టికెట్ రేట్ల సమస్య గురించి ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పి ఆర్జీవీ 'ఇండస్ట్రీ పెద్ద' అయ్యారని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.