యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన మూవీ ''ఆర్.ఆర్.ఆర్''. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ లెక్కల ప్రకారం 'దంగల్' 'బాహుబలి 2' తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాల జాబితాలో RRR మూడో స్థానం సాధించింది.
'ఆర్.ఆర్.ఆర్' మూవీ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాల్లో ఈ మూడు వారాల్లో 261 కోట్లకు పైగా షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందులో 108 కోట్లు ఒక్క నైజా ప్రాంతం నుంచే రావడం గమనార్హం. ఇప్పటికే లాభాల్లో ఉన్న నైజాం డిస్ట్రిబ్యూటర్ ఈ మేరకు గ్రాండ్ గా సక్సెస్ పార్టీ కూడా నిర్వహించారు. అయితే ఆంధ్రాలో మాత్రం ఈ సినిమా బయ్యర్లకు నష్టాలు తప్పవని విశ్లేషకులు అంటున్నారు.
'బాహుబలి' తర్వాత రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడం.. ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు కలిసి చేసిన చిత్రం అవ్వడంతో RRR చిత్రాన్ని భారీ రేట్లకు కొనుగోలు చేశారు. అయితే డొమెస్టిక్ లో ఈ మూవీ చాలా ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవాల్సి ఉంది. కాకపోతే ఇప్పుడు 'కేజీఎఫ్ 2' సినిమా థియేటర్లలోకి రావడంతో ఈ వీక్ లో పెద్దగా వసూళ్ళు ఆశించలేం.
ఈ నేపథ్యంలో RRR సినిమాను తీసుకున్న తెలుగు బయ్యర్లకు 10% నుండి 20% వరకూ నష్టపోయే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్ తెచ్చుకున్నప్పటికీ.. ఎక్కువ రేట్లకు కొనడంతో కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అవలేదని తెలుస్తోంది.
జక్కన్న తెరకెక్కించిన 'బాహుబలి' రేంజ్ లో RRR మూవీ మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయిందనే చెప్పాలి. కాకపోతే ఆయనకున్న క్రేజ్ తో ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నుంచి సురక్షితంగా బయటకి వచ్చింది. ఓవర్ సీస్ లో రూ. 96 కోట్ల దాకాకలెక్ట్ చేసిన ఈ మల్టీస్టారర్.. హిందీ బెల్ట్ లో రూ. 240 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తోంది.
ఇకపోతే నిర్మాత డీవీవీ దానయ్య రూ.450 కోట్లకు పైగా ఖర్చు చేసి RRR చిత్రాన్ని నిర్మించారు. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఫైనల్ రన్ లో ఈ ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా వరల్డ్ వైడ్ గా ఎంత వసూలు చేస్తుందో చూడాలి.
'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. అజయ్ దేవగన్ - అలియా భట్ - ఒలివియా మోరిస్ - శ్రియ - సముద్ర ఖని - రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించగా.. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు.