2020 బ్యాడ్ ఇయర్ గా రికార్డులకెక్కింది. కరోనా మహమ్మారీ కొందరి పాలిట శాపంగానూ మారింది. ఎన్నో ఆశలతో సినిమాని తీస్తే దానిని థియేటర్లలో విడుదల చేసుకునేందుకు ఆస్కారం లేకుండా పోయింది. అయితే నష్టం తగ్గించుకోవడంలో భాగంగా హీరో సూర్య లాంటి వాళ్లు ఓటీటీ రిలీజ్ లకు సిద్ధమైపోయారు. సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా (సూరరై పొట్రు) అమెజాన్ ప్రైమ్ లో రిలీజైంది.
అయితే ఈ విడుదలను తమిళ ఎగ్జిబిటర్లు మల్టీప్టెక్స్ వోనర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. సూర్య తీసుకున్న నిర్ణయం వల్ల ఎగ్జిబిషన్ రంగం పూర్తిగా దెబ్బ తింటుందని ఆరోపించారు. కానీ అవేవీ పట్టించుకోకుండా తన సినిమాని ఓటీటీల్లో రిలీజ్ చేసారు సూర్య. ఈ ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్ల జాబితాలో చేరింది సూరరై పోట్రు. సినిమా తెరకెక్కడం ఎంత ఇంపార్టెంటో రిలీజవ్వడం అంతే ఇంపార్టెంట్. లేదంటే నిర్మాత అయిన సూర్యకు భారీ నష్టాలు తప్పేవీ కావు. కానీ ఎగ్జిబిటర్లు మాత్రం తనపై పగ పట్టినట్టు అర్థమవుతోంది.
తాజాగా తమిళ ఎగ్జిబిటర్ల సంఘం మీడియా చిట్ చాట్ లో బహిరంగంగా అతడి పేరు పెట్టుకుండానే టార్గెట్ చేసింది. థియేటర్లను ఇవ్వడం వల్లనే ఆయన అంత పెద్ద స్టార్ గా ఎదిగి ఇప్పుడిలా చేశారు! అంటూ నిందారోపణలు చేశారు. తమిళనాడు థియేటర్ యజమానులు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పేరు పెట్టకుండానే నిందిస్తూ.. సూర్య అతని కుటుంబం థియేటర్ వ్యాపారాన్ని మూసివేయడానికి ప్రయత్నిస్తున్న ఏకైక కుటుంబం అంటూ సీరియస్ అయ్యారు. విజయ్ - ధనుష్ లాంటి పెద్ద స్టార్లు తమ చిత్రాలను థియేటర్లలో విడుదల చేస్తే సూర్య ఓటీటీలో రిలీజ్ చేశారని అన్నారు. ఇదంతా చూస్తుంటే కావాలనే ఇలా టార్గెట్ చేస్తున్నారా? థియేటర్లలో సూర్య సినిమాని ఆడనివ్వమని ముందే హెచ్చరించినట్టే తమిళ ఎగ్జిబిటర్ల సంఘం కట్టడి చేయనుందా? అన్నది చర్చనీయాంశమైంది.