ఇక... కొట్టేది ప్రభాసే అంటారా?

Update: 2015-03-18 04:29 GMT
రికార్డులు శాశ్వతం కాదు. ఎప్పటికప్పుడు పాత రికార్డులు చెరిగిపోయి కొత్త రికార్డులు పుడుతూనే ఉన్నాయి. పాత వసూళ్లను అధిగమించి కొత్త లెక్కలు  వస్తూనే ఉన్నాయి. రెండు దశాబ్ధాల ట్రాక్‌ రికార్డును పరిశీలిస్తే అప్పట్లో మహేష్‌ నటించిన పోకిరి ఓ సంచలనం. ఆరోజుల్లోనే 30కోట్లు పైగా వసూలు చేసిన సినిమా అది. ఆ తర్వాత ఐదారేళ్లకు చరణ్‌ నటించిన 'మగధీర' ఆ రికార్డుల్ని అధిగమించింది. దాదాపు 87కోట్లు వసూలు చేసింది ఈ సినిమా.

ఇటీవలే ఈ రికార్డును పవన్‌ అధిగమించాడు. అతడు నటించిన అత్తారింటికి దారేది 88కోట్లు వసూలు చేసిందని ప్రచారమైంది. ఇక 100కోట్ల క్లబ్‌లో చేరడమే తరువాయి. మరి ఇలాంటి సందర్భంలో ఆ రికార్డును కొట్టే మగాడెవరు? అంటే ఇప్పటికిప్పుడు ప్రభాస్‌ పేరు వినిపిస్తోంది. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాహుబలి ఈ రికార్డుల్ని అధిగమిస్తుందని, ప్రభాస్‌ని నంబర్‌ 1ని చేస్తుందని అంతా అంచనాలు వేస్తున్నారు.

ఇకపోతే పారితోషికం, వార్షికాదాయం లెక్కలు తీస్తే మహేష్‌ ఆర్జించేంత వేరే ఏ హీరో సంపాదించలేడు. ఆ లెక్కన టాప్‌1 హీరోగా అతడినే చెప్పుకోవాలి. అయితే సినిమా వసూళ్ల రికార్డు పరంగా మహేష్‌ రేసులోకి దూసుకొస్తేనే అతడి పేరు మార్మోగుతుంది. ఆ ఫీట్‌ సాధించే సినిమాగా కొరటాల దర్శకత్వంలోని 'శ్రీమంతుడు' నిలుస్తుందా? లేక ప్రభాస్‌కే సీన్‌ను వదిలేస్తాడా?
Tags:    

Similar News