శ్రీమంతుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. వచ్చే శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా స్క్రీన్ లపై సందడి చేయబోతున్నాడు మహేష్ బాబు. విడుదలకు దగ్గరవుతున్న కొద్దీ... శ్రీమంతుడి పై క్రేజ్ పెరిగిపోతోంది... ఫాలోయింగ్ అదిరిపోతోంది. ఎక్కడ చూసినా ప్రిన్స్ సందడే, ఏ సైట్ ఓపెన్ చేసినా శ్రీమంతుడి న్యూసే. ఒక్క మాటలో చెప్పాలంటే సినీ ఇండస్ట్రీ మొత్తం శృతితో కలిసి ప్రిన్స్ ఏం మాయ చేయబోతున్నాడో అని ఎదురుచూస్తోంది.
శ్రీమంతుడి కోసం మహేష్ ఇంటర్వ్యూ లు ఇవ్వడం మొదలుపెట్టాక... బ్లాగులు, సోషల్ నెట్వర్క్ సైట్లు.. అవే వార్తలతో నిండిపోతున్నాయి. ఈ సందడి ఎక్కువ కావడంతోపాటు.. బాహుబలి రిలీజై 3వారాలు ముగియడంతో.... సహజంగానే క్రేజ్ తగ్గింది. ఎంతగా అంటే... రూ.500 కోట్ల మార్క్ అందుకోబోతున్న తొలి తెలుగు సినిమాగా రికార్డ్ సృష్టించే దగ్గరపడుతున్నా... ఎవరూ పట్టించుకోవడం లేదు. బాహుబలి లాంటి అరుదైన చిత్రాన్ని కూడా పట్టించుకోకుండా... మహేష్ బాబు సినిమాపై జనం మాట్లాడుకున్నారు. దటీజ్ మహేష్ బాబు అనిపిస్తున్నాడు మన సూపర్ స్టార్.
తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న శ్రీమంతుడు.. రూ.120 కోట్ల మార్క్ ని ఈజీగా టచ్ చేస్తుందనే అంచనాలున్నాయి. రూ.100 కోట్ల మార్క్ ని టచ్ చేసిన తొలి మూవీ బాహుబలి. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఆ జోనర్ వేరు. ఇప్పుడు శ్రీమంతుడు ఈ మార్క్ అందుకుంటే మాత్రం అది రికార్డే. తెలుగు సినిమాలకు కొత్త మైలురాయిని, టార్గెట్ ని సెట్ చేసినట్లే. చేసినా చేస్తాడు మహేష్ బాబు ఎందుకంటే.. ఒకసారి కమిటయ్యాక ఇక మాట వినడు కదా.