అ..ఆ బాగుందా..కలెక్షన్ల దుమ్ము దుమారమేనట

Update: 2016-06-02 06:11 GMT
చిత్రపరిశ్రమలో ఇప్పుడో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రెండు భారీ సినిమాలు బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడటం.. సరైన సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. డైరెక్టర్ ఫిలిం అ.. ఆ సినిమా మీద అంచనాలు భారీగానడుస్తున్నాయి. నితిన్ ఇమేజ్ పరిమితమైనా.. త్రివిక్రమ్ మీదున్న అంచనాలుఅపరిమితంగా ఉండటంతో.. ‘‘అ.. ఆ’’ మీద పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్ల దుమ్ముదుమారమేనన్న మాట వినిపిస్తోంది. అదెలా అన్న దానిపై ఆసక్తికర ఆర్గ్యూమెంట్ చెప్పుకొస్తున్నారు.

వేసవి సెలవుల్లో విడుదలయ్యే సినిమాల మీద ప్రత్యేక ఆసక్తి ఉంటుంది.పరీక్షలు పూర్తయి.. సెలవుల్లో ఎంజాయ్ చేసే వాళ్లంతా సినిమాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే మిగిలిన సీజన్లతో పోలిస్తే.. దాదాపు నలభై రోజులకు పైనేఉండే సమ్మర్ సెలవుల్ని టార్గెట్ చేస్తూ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తుంటారు. ఈసమ్మర్ బొనాంజాగా వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్.. బ్రహ్మోత్సవం సినిమాల మీద భారీ అంచనాలే ఉన్నాయి. కానీ.. ఈ రెండూ అందుకు భిన్నమైన ఫలితాన్నిచూడాల్సిన దుస్థితి.

బ్రహ్మోత్సవంతో పోలిస్తే.. గబ్బర్ సింగ్ కలెక్షన్లు ఎంతోకొంత ఊరట కల్పిస్తాయి.కాకుంటే.. బ్రహ్మోత్సవంతో పోలిస్తే సర్దార్ గబ్బర్ సింగ్ కు జరిగిన బిజినెస్ పెద్దది. ఆ లెక్కన చూసుకుంటే.. వచ్చిన కలెక్షన్లు ఇబ్బంది పెట్టేవే. ఇక.. మహేశ్ బ్రహ్మోత్సవం గురించి.. దాని కలెక్షన్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటేఅంత మంచిది. ఈ రెండు సినిమాల్ని చూడాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమైనప్పటికీ.. సినిమాల మీద వచ్చిన టాక్ తో చూడకుండా ఉండినోళ్లసంఖ్య ఎక్కువే.

దీనికి కారణం లేకపోలేదు. గతంలో మాదిరి సినిమా అంటే సింఫుల్ వ్యవహారంకాదు. మల్టీఫ్లెక్స్ లు పెరగటం..సినిమా అంటే సినిమానే కాకుండా.. స్నాక్స్ లాంటి యవ్వారాలతో ఒక ఫ్యామిలీ సినిమాకు వెళ్లటం అంటే నగరాల్లో అయితే వెయ్యి రూపాయిలు.. చిన్న చిన్న పట్టణాల్లో అయితే రూ.500 ఖర్చు అవుతున్నపరిస్థితి. ఇప్పుడు చెప్పిన లెక్క సరాసరి మాత్రమే. కాస్త లావిష్ గా ఉండే వారైతేమరింత ఖర్చు అయ్యే పరిస్థితి. దీంతో.. సినిమా బాగోలేదన్న టాక్ వస్తే చాలు..థియేటర్ వరకూ రాని పరిస్థితి.

సర్దార్ గబ్బర్ సింగ్ కు నెగిటివ్ టాక్ రావటంతో చాలామంది సినిమా ప్రియులు బ్రహ్మోత్సవం చూద్దాంలే అనుకొని ఆగిపోయారు. భారీ అంచనాలు పెట్టుకున్న ఆ సినిమా మీద వచ్చిన టాక్ దెబ్బకు థియేటర్ దగ్గరకు వెళ్లేందుకు సైతం భయపడే పరిస్థితి. దీంతో.. సినిమా విడుదలైన మూడో రోజునే చాలా థియేటర్లలో బొమ్మలు మార్చేశారు. కొన్ని చోట్ల అయితే రెండో రోజే ఇలాంటిపరిస్థితి. సినిమా పరిశ్రమ అంచనాల ప్రకారం సర్దార్.. బ్రహ్మోత్సవం ఏమాత్రంబాగున్నా.. వంద కోట్లను టచ్ చేసేలా కలెక్షన్లు ఇరగదీస్తాయన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. కానీ.. ఈ రెండు సినిమాల మీద వచ్చిన టాక్ కలెక్షన్లను దారుణంగా దెబ్బ తీసింది.

సమ్మర్ హాలీడేస్ మరికొద్ది రోజుల్లో పూర్తి కానున్న నేపథ్యంలో.. సమ్మర్ సీజన్ చివరి సినిమా ‘అ..ఆ’నే కానుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదలకావాల్సి ఉన్నా.. బ్రహ్మోత్సవం కోసం దాని విడుదల ఆపి ఉంచారన్నది బహిరంగ రహస్యం. ఇదిలా ఉంటే.. బాగున్న సినిమా కోసం అందరూ ఎంతోఆత్రంగా ఎదురుచూస్తున్న వేళ.. అ..ఆ టాక్ పాజిటివ్ అయితే కలెక్షన్ల వర్షం భారీగా ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది. రెండు పెద్ద సినిమాల కోసం అత్రుతగా ఎదురుచూసి.. నిరాశతో సినిమాలకు వెళ్లకుండా ఉన్న వారంతా..సమ్మర్ సీజన్లో లాస్ట్ మూవీ అయిన ‘అ..ఆ’ బాగుందన్న మాట బయటకు వస్తేచాలు థియేటర్లకు జనాలు పోటెత్తటం ఖాయమంటున్నారు. సినిమా మీద పాజిటివ్ టాక్ వస్తే మాత్రం.. నితిన్ సినిమాకు ఇంత కలెక్షన్లు వస్తాయా? అని అనుకునేలా పరిస్థితి ఉంటుందన్న మాట తప్పదంటున్నారు. మరి.. త్రివిక్రమ్ మీదున్న నమ్మకంతో అ.. ఆ మీద భారీగా వ్యక్తమవుతున్న అంచనాలకు ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుందనే చెప్పాలి.
Tags:    

Similar News