ఈ మధ్య ప్రతీ క్రేజీ హీరో సినిమా బడ్జెట్ హద్దులు దాటేస్తోంది. మన సినిమాల మార్కెట్ స్థాయి, బిజినెస్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోవడంతో డైరెక్టర్లు ఏ విషయంలోనూ రాజీపడటం లేదు. నచ్చిన ఔట్ పుట్ కోసం హీరో మార్కెట్ ని కూడా లెక్కచేయకుండా భారీగా ఖర్చు చేయిస్తున్నారు. దీంతో ముందు అనుకున్న బడ్జెట్ కాస్తా హద్దులు దాటేస్తోంది. దీని వల్ల సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంటేనే మేకర్స్ లాభాల బాట పడుతున్నారు. లేదంటే తీరని నష్టాలని ఎదుర్కొంటూ నష్టాలని బయ్యర్లకు తిరిగి చెల్లించలేక వార్తల్లో నిలుస్తున్నారు.
ఇదిలా వుంటే యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్నలేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్'. స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. అమెరికన్ సిరీస్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'బోర్న్'లోని జాసన్ బోర్న్ క్యారెక్టర్ స్ఫూర్తితో ఈ మూవీని హాలీవుడ్ రేంజ్ మేకింగ్ తో తెరకెక్కిస్తున్నారు.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ఆగస్టు 12న తెలుగు, తమిళ,మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అయిపోతోంది. అఖిల్ నటిస్తున్న ఐదవ చిత్రమిది. అంతే కాకుండా సురేందర్ రెడ్డి 'సైరా' తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఈ ఇద్దరికి ఇది చాలా ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ గా మారింది. ఈ మూవీతో అఖిల్ బిగ్ లీగ్ లోకి వెళ్లాలి, సురేందర్ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ తో కంబ్యాక్ అవ్వాలనే ఆలోచనలో ఈ మూవీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి బడ్జెట్ బాగా పెరిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
కథ అనుకున్న విధంగా రావడానికి సురేందర్ రెడ్డి ముందు అనుకున్న బడ్జెట్ కు మించి ఖర్చు చేయించారని, చాలా వరకు రీ షూట్ లు చేశారని, ఆ కారణంగానే ఈ మూవీ బడ్జెట్ కాస్తా 65 కోట్లకు చేరిందని తెలుస్తోంది.
అఖిల్ కున్న మార్కెట్ కు ఇది పెద్ద సాహసమే అయినా మన సినిమాలకు పాన్ ఇండియా వైడ్ గా పెరిగిన మార్కెట్ దృష్ట్యా నిర్మాత సేఫ్ గా బయటపడే అవకాశం వుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో మేకర్స్ కు 38 కోట్లు లభించాయట. ఇక మిగిలిన 27 కోట్లు థియేట్రికల్ రైట్స్ ద్వారా రాబట్టగలిగితే నిర్మాతలు సేఫ్ అయినట్టే.
మేకర్స్ మాత్రం సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది కాబట్టి ఎత్త లేదన్నా థియేట్రికల్ రైట్స్ పరంగా 30 నుంచి 40 కోట్ల వరకు వచ్చే అవకాశం వుందని భావిస్తున్నారట. అదే జరిగితే 10 కోట్లకు మించి 'ఏజెంట్' మేకర్స్ టేబుల్ ప్రాఫిట్ ని సొంతం చేసుకోవడం ఖాయం అని ట్రేడ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. శుక్రవారం విడుదలైన టీజర్ ఆకట్టుకునే రేంజ్ లో వుంది. దీంతో మేకర్స్ లో మరింత కాన్ఫిడెన్స్ పెరిగిందట.