సౌత్ నుంచి ఎవరైనా స్టార్ హీరో హాలీవుడ్ కి వెళ్లి సినిమా చేస్తున్నారంటే అది దేశవ్యాప్తంగా అభిమానుల్లో చర్చనీయాంశమవుతుంది. ఇప్పటికే బాలీవుడ్ లో సత్తా చాటిన తమిళ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు ఏకంగా అవెంజర్స్ మేకర్స్ రసో బ్రదర్స్ తో ఓ హాలీవుడ్ సినిమా కోసం పని చేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
జులై 22న విడుదల కానున్న రూసో బ్రదర్స్ తాజా నెట్ ఫ్లిక్స్ ప్రాజెక్ట్ `ది గ్రే మ్యాన్` లో తమిళ స్టార్ ధనుష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు. ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ థ్రిల్స్ తో ఆకట్టుకుంది. ట్రైలర్ సియెర్రా ప్రోగ్రామ్ పరిచయంతో ప్రారంభమైంది. దీనిలో కొంతమంది మిస్టరీ మెన్ అనధికారిక వ్యాపార ప్రయోజనాల కోసం లేదా గ్రే మ్యాన్ ని నియమిస్తారు. అయితే ఈ ట్రైలర్ లో ధనుష్ ప్రాధాన్యత అంతంత మాత్రంగానే కనిపించింది. 4 సెకన్ల పాటు ఇలా మెరిసి వెళ్లిపోతాడు. అయితే దీనిపై ధనుష్ అభిమానులు అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. తమ ఫేవరెట్ ని పూర్తి నిడివి పాత్రలో ఒక హాలీవుడ్ సినిమాలో చూస్తామని ఆశిస్తే అక్కడ స్క్రీన్ స్పేస్ లేకుండా పోయింది.
తాజా ట్రైలర్ లో హాలీవుడ్ స్టార్లు ర్యాన్ గోస్లింగ్ - క్రిస్ ఎవాన్స్ తదితరులు విస్తారమైన స్క్రీన్ స్పేస్ తో ట్రైలర్ లో అలరించారు. అయితే ధనుష్ రెప్పపాటు సన్నివేశంలో కనిపించాడు. ఇది ధనుష్ అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ ప్రాజెక్ట్ ను ప్రముఖ రస్సో బ్రదర్స్ దర్శకత్వం వహించినందున అభిమానులు ధనుష్‌ను కొత్త అవతార్ లో ప్రదర్శిస్తారని ఆశించారు. ఇప్పుడు అలా జరగకపోవడంతో అసంతృప్తి ని వ్యక్తం చేస్తున్నారు.
ట్రైలర్ లో గ్లింప్స్ అదుర్స్ ది గ్రేమ్యాన్ ట్రైలర్ రెండు నిమిషాల ట్రైలర్ ఆద్యంతం భారీ యాక్షన్ థ్రిల్స్ తో రక్తి కట్టించింది. అయితే ఇందులో ధనుష్ కేవలం నాలుగైదు సెకన్ల పాటు ఫ్లాష్ లా మెరిసాడు. మాజీ సిఐఎ కోవర్ట్ ఆపరేషన్ వేట నేపథ్యంలో ట్రైలర్ ఆకట్టుకుంది. వీడియోలో థ్రిల్స్ కి అయితే కొదవే లేదు. ఇందులో ధనుష్ పాత్ర గురించి ఎటువంటి వివరాలు లేవు. 'ది గ్రే మ్యాన్' జూలై 15న చాలా పరిమిత థియేటర్లలో విడుదల కానుంది. అయితే నెట్ ఫ్లిక్స్ లో జూలై 22 నుండి స్ట్రీమింగ్ కోసం ఈ సినిమా అందుబాటులో ఉంటుంది.
ఇటీవలి కాలంలో వచ్చిన పలు ట్రైలర్స్ తో పోలిస్తే ఈ ట్రైలర్ కంటెంట్ ని ఎలివేట్ చేసిన తీరు ఆసక్తిని కలిగిస్తోంది. స్పై యాక్షన్ నేపథ్యం ప్రధాన బలంగా కనిపిస్తోంది. అవెంజర్స్ దర్శకుడి గ్రేమ్యాన్ లో ధనుష్ రోల్ ఎంతసేపు ఉంటుంది? అన్నది ఇప్పటికి సస్పెన్స్. కానీ ఇంతలోనే అభిమానుల్లో అసంతృప్తి రాజుకుంది.
ఇది సరికాదేమో ఆలోచించాలి అయితే వందల కోట్ల బడ్జెట్లతో తెరకెక్కించే ఇలాంటి అద్భుతమైన ఫ్రాంఛైజీలో ఒక సౌత్ స్టార్ చోటు దక్కించుకోవడమే గొప్ప అనుకుంటే.. ఇప్పుడు ధనుష్ కి ఎక్కువ ప్రాధాన్యత లేదని బాధపడడం కూడా సరైనది కాదేమో! ఒకవేళ గ్రేమ్యాన్ లో తదుపరి పార్ట్ కి అతడి ప్రాధాన్యత పెరిగేందుకు ఆస్కారం ఉంటుందేమో... ఇప్పటికి ఎవరికీ తెలియని అంశం. ధనుష్ ఫ్యాన్స్ హోప్ తో వేచి చూడాల్సి ఉంటుంది.