F 2 సినిమా సక్సెస్ కావడంతో అదే తరహాలో ఫ్రాంచైజ్ గా కొనసాగించాలని దర్శకుడు అనిల్ రావిపూడి F3 సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ ఐడియా టాలీవుడ్లో ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ అయితే ప్రతి ఇంటర్వ్యూలో కూడా కాన్ఫిడెంట్గా చెబుతోంది. ప్రమోషన్స్ విషయంలో అయితే ఎవరూ తగ్గకుండా ముందుకు సాగుతున్నారు అని చెప్పాలి.
ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో F 3కి సంబంధించిన విషయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి కేవలం సినిమాను తెరకెక్కించడమే కాకుండా సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లాలి అనే విషయంలో కూడా మంచి ఆలోచనలు చేస్తున్నాడు అని చెప్పవచ్చు. ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలు సినిమాకు అయితే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. సినిమాకు సంబంధించిన సాంగ్స్ అలాగే మేకింగ్ వీడియోలతో కూడా మంచి హైప్ ఐతే క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన మేకింగ్ వీడియో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో వెంకీ, వరుణ్, అలీ, సునీల్ ఇలా స్టార్ యాక్టర్స్ ఉన్నప్పటికీ.. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ వీడియోలో హైలెట్ అయ్యాడు. సాధారణంగా అనిల్ రావిపూడి తన ప్రతి సినిమా లోని సన్నివేశాన్ని యాక్ట్ చేసి మరీ చూపిస్తాడు అని అంటుంటారు. అది నిజమే అని అనిపిస్తుంది. ఎవరు ఎంత టైం లో చేయాలి ఎంత బాగా చేయాలి అనేది దర్శకుడికి బాగా తెలిసి ఉండాలి. అప్పుడే సినిమా అనుకున్నట్లుగా వస్తుంది. ఆ విషయంలో అనిల్ రావిపూడి 100% కరెక్ట్ అని నిరూపిస్తున్నాడు.
ఇక ఈ మేకింగ్ వీడియోలో హడావిడి చూస్తుంటే సినిమాలో కామెడీ ఊహించని రేంజ్ లో ఉండేటట్లుగా తెలుస్తోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా టికెట్ల రేట్లు కూడా ఎక్కువగా పెంచకుండా రిలీజ్ చేస్తున్నట్లు ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారు. ఒక విధంగా ఈ సినిమాకు అదే చాలా బాగా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ లోకి వచ్చి చాలా కాలం అవుతుంది. మరి సినిమా ఎంతవరకు కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.
Full View