భీమ్లా కోసం వెన‌క్కి త‌గ్గిన 'ఎఫ్ 3'

Update: 2021-12-21 06:33 GMT
ఒక పెద్ద సినిమా రిలీజ్ మారితే ఆ త‌రువాత బ‌రిలోకి దిగాల్సిన చిత్రాలు రిలీజ్ డేట్ లు కూడా మారాల్సిందే. ఇప్పుడు టాలీవుడ్ లో అదే జ‌రుగుతోంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న క‌ల్యాణ్ న‌టించిన మాసీవ్ ఎంట‌ర్ టైన‌ర్ `భీమ్లా నాయ‌క్‌`. రానా ద‌గ్గుబాటి కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సాగ‌ర్ కె. చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లేని అందించారు. త‌మ‌న్ సంగీతం అందించిన ఈ మూవీ సాగ్స్ ఇప్ప‌టికే నెట్టిం రికార్డులు సృష్టిస్తున్నాయి.

మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా రూపొందిన ఈ మూవీని సంక్రాంతి బ‌రిలో జ‌న‌వ‌రి 12న నిల‌పాల‌ని మేక‌ర్స్ చాలా రోజులుగా చెబుతూ వ‌స్తున్నారు. అధికారికంగా రిలీజ్ డేట్ ని కూడా ప్ర‌క‌టించారు. అయితే అనూహ్యంగా సంక్రాంతి బ‌రిలో పోటీ వుండ‌టం.. పెద్ద సినిమాలు పోటీప‌డుతుండ‌టంతో `భీమ్లా నాయ‌క్‌` ని సంక్రాంతి రేస్ నుంచి త‌ప్పించారు. అయితే దీని ప్ర‌భావం మిగ‌తా సినిమాల‌పై ప‌డింది. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల చేస్తున్న‌ట్టుగా మంగ‌ళ‌వారం డేట్ ని కూడా ఫైన‌ల్ చేశారు.

అయితే ఈ డేట్ న రిలీజ్ కోసం ఫిక్స‌యిన `ఎఫ్ 3` అనూహ్యంగా భీమ్లా కోసం వెన‌క్కి త‌గ్గాల్సి వ‌చ్చింది. `భీమ్లా నాయ‌క్‌` సంక్రాంతి రేస్ నుంచి త‌ప్పుకుని ఫిబ్ర‌వ‌రి 25కు మార‌డంతో ఆ డేట్ లో రిలీజ్ కావాల్సిన `ఎఫ్ 3` ఏప్రిల్ 29కి మారాల్సి వ‌చ్చింది. ఇదే విష‌యాన్ని దిల్ రాజు మంగ‌ళ‌వారం జ‌రిగిన ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో స్ప‌ష్టం చేశారు.  అంతే కాకుండా భీమ్లా రిలీజ్ మార‌డం వ‌ల్ల వ‌రుణ్ తేజ్ మ‌రో సినిమా `గ‌ని` రిలీజ్ కూడా మారే అవ‌కాశాలు వున్న‌ట్టుగా తెలుస్తోంది. ముందు అనుకున్న దాని కంటే `గ‌ని` రిలీజ్ మార్చి నెలాఖ‌రుకి వెళ్లిన‌ట్టుగా తెలుస్తోంది.

ఇదిలా వుంటే `ఎఫ్ 3` లో విక్ట‌రీ వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ లుగా త‌మ‌న్నా, మెహ్రీన్ న‌టిస్తున్నారు. `ఎఫ్ 2` వంద కోట్ల క్ల‌బ్ లో చేర‌డంతో `ఎఫ్ 3` పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా `ఎఫ్ 3`ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 29న వ‌ర‌ల్డ్ వైడ్ గా ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే. 
Tags:    

Similar News