#F3 లో F2 కంటే కామెడీ ఫ్ర‌స్టేష‌న్ మూడు డోసులు అదనం!

Update: 2021-09-17 12:03 GMT
వెంకటేష్- తమన్నా... వరుణ్ తేజ్ - మెహ్రీన్ జంట‌లు తిరిగి షూటింగ్ కి వచ్చారు. ఆన్ లొకేష‌న్ బోలెడంత సంద‌డి చేశారు. అస‌లు వీళ్ల ఫ‌న్ ఫ్ర‌స్టేష‌న్ ఏ రేంజులో సాగిందో ఆవిష్క‌రిస్తూ తాజాగా అనీల్ రావిపూడి -దిల్ రాజు బృందం అదిరిపోయే విజువ‌ల్ ని వ‌దిలారు. బ్లాక్ బస్టర్ `ఎఫ్ 2` కి సీక్వెల్ గా `ఎఫ్ 3` చిత్రీకరణను హైదరాబాద్ లో తిరిగి ప్రారంభించారు. ప్రస్తుత షెడ్యూల్ చాలా వారాల పాటు కొనసాగుతుంది.

దర్శకుడు అనిల్ రావిపూడి డిసెంబర్ నాటికి సినిమాను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. సంక్రాంతి రేసు నుంచి ఒకటి లేదా రెండు పెద్ద సినిమాలు వెనక్కి వెళితే 2022 సంక్రాంతికి త‌మ‌ సినిమాను విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేసారు. అందుకే డిసెంబర్ నాటికి షూటింగ్ పార్ట్ పూర్తి చేయడానికి మేకర్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.

`ఎఫ్ 3` పూర్తి కామెడీ ఎంటర్ టైనర్. ప్రీక్వెల్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈసారి ట్రిపుల్ ఫ‌న్ ట్రిపుల్ ఫ్ర‌స్టేష‌న్ ని తెర‌పై చూపిస్తామ‌ని మాటిచ్చారు. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో ఎఫ్ 3 సెట్లో సంద‌డి ఎలా ఉందో ఆవిష్క‌రించారు. ఈ వీడియోలో వెంకీ-త‌మ‌న్నా.. వ‌రుణ్ తేజ్- మెహ్రీన్ జంట‌ల‌తో పాటు దిల్ రాజు - అనీల్ రావిపూడి- శిరీష్ త‌దిత‌రులు క‌నిపిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Full View
Tags:    

Similar News