టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్2. వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ సరసన మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ 2019 సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమా భారీ విజయం అందుకుంది. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్ తెరకేక్కిస్తున్నాడు అనిల్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వేసవి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇటీవలే ఎఫ్3 సీక్వెల్ షూటింగ్ ప్రారంభమైంది. ఆల్రెడీ ఫస్ట్ డే నుండే వెంకటేష్ షూట్ లో పాల్గొన్నాడు. హైదరాబాదులో వేసిన ప్రత్యేక ఇంటి సెట్ లో ఎఫ్3 షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్లో వరుణ్ తేజ్ కరోనా బారినపడి కోలుకున్నాడు. ఇటీవలే వరుణ్ కూడా షూటింగులో భాగమాయ్యడు.
అయితే వరుణ్ సెట్ లో పాల్గొన్న సందర్బంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్విట్టర్ వేదికగా తనతో దిగిన పిక్ షేర్ చేసి ట్రీట్ ఇచ్చాడు. అలాగే 'సెట్ లోకి స్వాగతం.. ఇప్పుడు అసలు ఫన్ మొదలైంది' అంటూ ట్వీట్ చేసాడు. అలాగే ఈరోజు వరుణ్ పుట్టినరోజు సందర్బంగా ఎఫ్3 టీమ్ సోషల్ మీడియా వేదికగా వరుణ్ కొత్త పిక్ షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుణ్ కొత్త లుక్ ఆకట్టుకుంటుంది. ఫోటో చూస్తే వరుణ్ చాలా హుషారుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అలాగే షూటింగ్ కూడా చకచకా పూర్తి చేస్తున్నారట. ఇక వరుణ్ ఎఫ్3 సినిమాతో పాటు గని సినిమా కూడా చేస్తున్నాడు. ఈరోజే గని మూవీ నుండి మోషన్ పోస్టర్ విడుదల చేశారు. బాక్సర్ గా వరుణ్ లుక్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుందట. ప్రస్తుతం వరుణ్ సెలెబ్రేషన్స్ మోడ్ లో ఉన్నట్లు సమాచారం.