అక్కౌంట్స్ ఫ్రీజ్ సూపర్ స్టార్ మహేశ్ కు తెలిసే జరిగిందా..? అంటే ఔననే సమాధానం విన్పిస్తుంది. ట్యాక్స్ కట్టకపోవడం వల్ల అక్కౌంట్స్ ఫ్రీజ్ మహేశ్ బాబుకి తెలిసే జరిగిందని.. జీఎస్టీ కమిషరేట్ ప్రకటించింది. మరో రెండు రోజుల్లో మిగిలిన మొత్తాన్ని కూడా వసూలు చేస్తామని చెప్పింది. మరోవైపు.. మహేశ్ లీగల్ టీమ్ వాదన మరోలా ఉంది.
అసలు ఏం జరిగింది..?
కోర్టు ప్రొసీడింగ్స్ - ఇన్ కం ట్యాక్స్ లాంటి వ్యవహారాలకు సంబంధించి కచ్చితంగా నోటీసులు ముందుగానే ఇస్తారు. ఇందుకు మహేశ్ కు ఏం మినహాయింపు ఏం లేదు. మహేశ్ కు 2014లోనే నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసులపై మహేశ్ అండ్ టీమ్ స్పందించలేదు. దీంతో.. 2012లో ఆర్డర్ పాస్ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ట్రిబ్యూనర్ లోఅప్పీలు చేసుకున్నారు. అయితే..అక్కడ ఆయనకు ఊరట లభించలేదు. దీంతో సూపర్ స్టార్ మహేశ్.. ట్రిబ్యూనల్ ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ.. ఈ ఏడాది సెప్టెంబర్ లో హైకోర్టుని ఆశ్రయించారు. స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో.. ఆర్టిక చట్టం సెక్షన్ 87 ప్రకారం.. మహేశ్ ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు అధికారులు చెప్పారు. ట్రిబ్యునల్ కు - హైకోర్టుకి ఆడిటర్లు - లీగల్ టీమ్ మహేశ్ కు తెలీకుండా వెళ్తారా అంటే వెళ్లరు. సో.. ఇదంతా సూపర్ స్టార్ మహేశ్ కు తెలిసే జరిగింది.
మహేశ్ ట్యాక్స్ ఎందుకు కట్టలేదంటే..
తెలిసి తెలిసి ట్యాక్స్ ఎగ్గొట్టాలని ఎవ్వరూ అనుకోరు. ఒక సినిమాకు దాదాపు రూ.25 కోట్లు తీసుకునే మహేశ్ లాంటి హీరోకు రూ.18లక్షలు అంటే చాలా చిన్నమొత్తం. అలాంటిది మహేశ్ కావాలని ట్యాక్స్ కట్టకపోగా.. ట్యాక్స్ కట్టాల్సిన మొత్తం ఎందుకు కట్టాలంటూ ట్రిబ్యూనల్ ని ఆశ్రయించారు. అయితే.. దీని వెనుక ఆయన లీగల్ టీమ్ చెప్పే పాయింట్ కూడా ఆసక్తికరంగానే ఉంది. మహేశ్ లీగల్ టీమ్ చెప్పినదాని ప్రకారం.. 2007-08 సంవత్సరానికి గానూ సర్వీస్ ట్యాక్స్ కట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఈ కాలంలో అంబాసిడర్ సర్వీసెస్ ట్యాక్స్ పరిధిలోకి రాదు. అంబాసిడర్ సర్వీసెస్ ని సెక్షన్ 65 (105) ద్వారా 2010 నుంచి ఇంప్లిమెంట్ చేశారు. దీంతో.. మహేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కాలం 2007-08 కాబట్టి ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదన్నది లీగల్ టీమ్ వాదన. అదీగాక కేసు ఇంకా కోర్టు పరిథిలోనే ఉంది. అయినా కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అక్కౌంట్స్ ఫ్రీజ్ చేశారని మహేశ్ బాబు లీగల్ టీమ్ వాదిస్తోంది. బాధ్యతాయుతమైన పౌరుడిగా మహేశ్ బాబు ఇప్పటివరకు అన్ని పన్నులను సకాలంలో చెల్లించారని చెప్తోంది.
జీఎస్టీ కమిషనరేట్ ఏమంటోంది..?
మహేశ్‌బాబుకు 2010లోనే నోటీసులు ఇచ్చామని జీఎస్టీ అడిషనల్ కమిషనర్ ఆనందర్ కుమార్ తెలిపారు.రెస్టారెంట్లు - షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాల రెమ్యూనరేషన్ పై ట్యాక్స్ కట్టకపోవడంతో ఆర్థిక చట్టం ట్యాక్స్ 1994 సెక్షన్ 87 ప్రకారం బ్యాంకు అకౌంట్లు జప్తు చేశామనిచెప్పారు. వీటిలో ఒకదాని నుంచి ఇప్పటికే రూ.42 లక్షలు రికవరీ చేశామని - మిగిలిన మొత్తాన్ని రెండో అకౌంట్ నుంచి రికవరీ చేస్తామని ఆనందకుమార్ పేర్కొన్నారు.
మహేశ్ ఏం చేస్తున్నాడు..?
ప్రస్తుతం మహేశ్ ఇండియాలో లేడు. మహర్షి సినిమా షెడ్యూల్ పూర్తి అవ్వడంతో.. ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్ కు వెళ్లాడు. మహేశ్ ఇండియాలో లేని టైమ్ లో ఆయన అక్కౌంట్స్ ఫ్రీజ్ చేశారు. అయితే.. అక్కడ నుంచి తన లీగల్ టీమ్ తో కో ఆర్డినేట్ చేసుకుంటున్నాడు మహేశ్. చట్టం చేయక ముందు వచ్చిన ఆదాయంపై ఇప్పుడు ట్యాక్స్ కట్టమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పటికే అక్కౌంట్స్ ఫ్రీజ్ అయ్యాయి. పన్ను ఎగ్గొట్టాడనే చెడ్డపేరు కూడా వచ్చేసింది. అందుకే మహేశ్ పోరాడాలని నిర్ణయించుకున్నాడు. జీఎస్టీ కమిషనరేట్ తో తాడో పేడో తేల్చుకోవాలని అనుకుంటున్నాడు.