సినిమాల్లో బాగా వెలిగిన.. అంతో ఇంతో మెరుపులు మెరిపించిన భామలు.. అవకాశాలు అడుగంటిపోయిన తర్వాత.. లేదా కెరీర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత.. మన దగ్గర అయితే అసలు కనిపించనే కనిపించరు. ఓ ఐదేళ్లో.. పదేళ్లో గడిచిన తర్వాత పూర్తిగా షేపవుట్ అయిపోయిన పరిస్థితుల్లో.. అయితే అక్క-వదిన పాత్రల్లో.. లేదంటే అమ్మ-అత్త రోల్స్ ను చేసినపుడే మళ్లీ దర్శనం.
అసలు అప్పటివరకూ అంజనం వేసి వెతికినా వీరి జాడ కనిపించదు. ఇది టాలీవుడ్ పరిస్థితి అయితే.. బాలీవుడ్ లెక్క వేరేగా ఉంటుంది. ముంబాయిలో ఫ్లాపు హీరోయిన్లు అందరూ సినిమాలు లేకపోయినా కూడా పార్టీలు.. ఈవెంట్స్ లో కనిపిస్తూ ఉంటారు. సినిమా జనాలు ఇచ్చే పార్టీలు.. గ్లామర్ ఈవెంట్స్.. పబ్లిక్ గ్యాదర్ అయ్యే పలు రకాల ఎగ్జిబిషన్స్ లో సందడి చేస్తూ ఉంటారు. ట్రంక్ షో అంటూ ముంబైలో ఓ ఈవెంట్ జరుగుతుంటే.. ఒక్క సినిమా ఆఫర్ కూడా అనేక మంది సుందరాంగులు కనిపించారు.
అదే మన దగ్గర అయితే.. అసలు ఇలాంటి పార్టీలు-ఈవెంట్లు పెద్దగా జరగనే జరగవు. ఒకవేళ జరిగినా.. ఫామ్ లో ఉన్న బ్యూటీస్ ను తప్ప ఫేడవుట్ అయిన సుందరాంగులను పట్టించుకునే వారే ఉండరు. అందుకే ముంబై గ్లామర్ వరల్డ్ లో అంతో ఇంతో పేరు కోసం అందరూ తెగ పాకులాడుతుంటారు. ఏమైనా గ్లామర్ విషయంలో ముంబై లెక్కే వేరప్పా!