మలయాళ సినీ పరిశ్రమ నుంచి ఎందరో గొప్ప నటులు వచ్చారు. జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేశారు. మమ్ముట్టి.. మోహన్ లాల్ తర్వాత ఈ తరంలో అంత గొప్ప పేరు సంపాదించిన ఫాహద్ ఫాజిల్ ఒకడు. అతను గత ఏడాది ‘తొండిముతలుమ్ దృక్సక్షియుమ్’ అనే సినిమాకు జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. ఇంకా చాలా సినిమాల్లో అతను అద్భుతమైన నటన కనబరిచాడు. అతను ఇప్పటికే తమిళంలో ‘వేలైక్కారన్’ అనే సినిమాలో మంచి పాత్ర చేశాడు.
ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల అతను నటించబోతుండటం విశేషం. ఇటీవలే ‘కాలా’తో పలకరించిన రజనీ.. దీని తర్వాత ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఓ కీలక పాత్రకు ఫాహద్ ఎంపికయ్యాడు. అతడి పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు. అసలు కార్తీక్ సినిమాల్లో చిన్న పాత్రయినా సరే.. చాలా ప్రాధాన్యంతో కూడుకుని ఉంటుంది. మరి రజనీ సినిమాలో ఫాహద్ తన ప్రత్యేకతను ఎలా చాటుకుంటాడో చూడాలి.
ఈ చిత్రంలో మరో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా ముఖ్య పాత్ర పోషిస్తుండటం విశేషం. కార్తీక్ తీసిన తొలి మూడు సినిమాల్లోనూ విజయ్ కీలక పాత్రలు పోషించాడు. ఇప్పుడు అతడికి ఎలాంటి పాత్ర ఇచ్చాడో చూడాలి. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కూడా ఓ కీ రోల్ చేస్తోంది. కాజల్ అగర్వాల్ కూడా ఇందులో ఓ పాత్ర చేస్తున్నట్లు చెబుుతన్నారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.