సౌత్ భామ‌ల‌‌ ఫేక్ ఫాలోయింగ్ పైనా పోలీసుల క‌న్ను!

Update: 2020-07-25 04:45 GMT
సోష‌ల్ మీడియాల్లో ఎంత‌గా ఫాలోయింగ్ ఉంటే అంతగా ఆ సెల‌బ్రిటీకి క్రేజు ఉంద‌ని అర్థం. స‌రిగ్గా ఇదే అంశం వారికి భారీగా వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌ ఆదాయాన్ని కూడా తెచ్చి పెడుతోంది. అందుకే ఇటీవ‌లి కాలంలో ర‌క‌ర‌కాల మార్గాల్ని అనుస‌రించి ఫాలోవ‌ర్స్ ని పెంచుకునేందుకు సెల‌బ్రిటీలు వెన‌కాడ‌డం లేదు. ప‌లువురు అగ్ర క‌థానాయిక‌లు ఈ త‌ర‌హా రేసింగ్ కి పాల్ప‌డుతున్నారు. అంతేకాదు.. కొంద‌రు భామ‌లు త‌ప్పుడు విధానంలో త‌మ‌కు ఫేక్ ఫాలోవ‌ర్స్ ని పెంచుకునే ప‌నిలో ఉన్నార‌ని తాజాగా పోలీస్ ద‌ర్యాప్తులో తేలింది. దీంతో ఇలాంటి చెత్త ప‌నుల‌కు పాల్ప‌డే ప‌లువురు అగ్ర క‌థానాయిక‌ల ఆట క‌ట్టించాల‌ని వారిని విచారించాల‌ని ముంబై సైబ‌ర్ క్రైమ్ పోలీసులు నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఫేక్ ఫాలోవ‌ర్స్ ని పెంచుకునేందుకు కొన్ని విదేశీ స్వ‌దేశీ కంపెనీల్ని నియ‌మించుకున్న దీపిక ప‌దుకొనే.. ప్రియాంక చోప్రా లాంటి స్టార్ల‌కు సైబ‌ర్ క్రైమ్ పోలీసులు ఝ‌ల‌క్ ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రు భామ‌ల్ని విచారించేందుకు పోలీసులు రెడీ అవుతున్నార‌ట‌.

ట్వీట్లు .. రీట్వీట్లు.. లైక్ లు.. కామెంట్లు అంటూ స‌మాజిక మాధ్య‌మాల్లో ఫాలోయింగ్ ని పెంచేందుకు దాదాపు 70 కంపెనీల వ‌ర‌కూ ప‌ని చేస్తున్నాయ‌ని పోలీసులు గుర్తించారు. ఈ భారీ కుంభకోణంలో ఒక ఫ్రెంచ్ సంస్థ కూడా ఉందని కనుగొన్నారు. దీపిక‌.. పీసీ ఇద్ద‌రికీ భారీగా న‌కిలీ అనుచ‌రులు పెర‌గ‌డానికి ఈ ఫేక్ కంపెనీలే కార‌ణం. దీపిక‌కు ఇన్ ‌స్టా‌లో 50 మిలియన్లు... ట్విట్టర్ ‌లో 27+ మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా.. పీసీకి ఇన్ ‌స్టా మాధ్య‌మం‌లో 55+ మిలియన్లు.. ట్విట్టర్ ‌లో 26+ మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. వీళ్లంతా నిజ‌మైన అనుచ‌రులేనా లేక డ‌బ్బుతో కొనేసిన వాళ్లా అన్న‌ది పోలీస్ విచార‌ణ‌లో తేల‌నుంది. అన్న‌ట్టు ఈ త‌ర‌హాలో ఫేక్ ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటున్న ప‌లువ‌రు సౌత్ అగ్ర క‌థానాయిక‌ల‌పైనా పోలీసులు క‌న్నేశార‌ని తాజాగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయ్.
Tags:    

Similar News