టీజర్ టాక్: ఓల్డ్ సిటీకి తీసుకెళ్తున్న ఫలక్ నుమా దాస్

Update: 2019-02-13 16:06 GMT
'ఈ నగరానికి ఏమైంది' సినిమాలో నటించిన విష్వక్సేన్ లీడ్ యాక్టర్ గా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'ఫలక్ నుమా దాస్'.  ఈ సినిమాలో దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు.  మలయాళంలో సంచలనం సృష్టించిన రా అండ్ బోల్డ్ ఫిలిం 'అంగామలి డైరీస్' కు తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా టీజర్ కాసేపటి క్రితం రిలీజ్ అయింది.

టీజర్ డ్యూరేషన్ 1.34 నిముషాలే.. కానీ రా అండ్ బోల్డ్ ఫీల్ తో చూసేవాళ్ళను ఒక్కసారి షేక్ చేస్తుంది.  "ఫలక్నామాలో బారబజే లేషినమా..ఏక్ బజే తిన్నమా.. రొండింటికి గలిషినామా..అడ్డమెవడన్నా వస్తే (బీప్) "అంటూ ఫస్ట్ డైలాగ్ తోనే డైరెక్ట్ గా ఓల్డ్ సిటీకి తీసుకెళ్ళి అక్కడి గల్లీలలో మనల్ని కూర్చోబెట్టేస్తుంది టీజర్. సెన్సార్లు.. సంప్రదాయాల సంగతేమో గానీ మనకు అసలు రియాలిటీ ఇదే కదా అని ఒక్కసారి అన్పించక మానదు. ఇక హీరో గ్యాంగ్ ఇలా ఉంటే కొట్లాటలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుడు కామనే కదా.  అక్కడ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తరుణ్ భాస్కర్ కనిపించాడు. నిజమైన రఫ్ అండ్ టఫ్ పోలీస్ స్టైల్ లోనే "ఏందిరా హీరోనా నువ్వు. బాడకొవ్ బటనెయ్" అంటూ సూపర్ పంచ్ ఇచ్చాడు. 

డైలాగులే కాకుండా ఓవరాల్ గా ప్రతి ఫ్రేమ్ రియలిస్టిక్ గా కనిపించింది. విద్యా సాగర్ సినిమాటోగ్రఫీ.. వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సింప్లీ సూపర్బ్.  మలయాళంలో సినిమా గ్యాంగ్ ఫైట్స్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇక్కడ నేపథ్యం ఓల్డ్ సిటీ తీసుకోవడంతో పక్కాగా సెట్ అయింది. కానీ ఈ రేంజ్ బోల్డ్ డైలాగులు సెన్సార్ ని దాటి ఎలా బయటకొస్తాయనేది ఆలోచించాల్సిన విషయమే.  వీటి సంగతి పక్కన బెడితే ఈ 'ఫలక్ నుమా దాస్' తెలుగులో మరో సంచలనం సృష్టించే అవకాశాలు మాత్రం పుష్కలంగా కన్పిస్తున్నాయి. ఆలస్యం ఎందుకు.. ఎక్ బార్ మౌస్ దబాకే పూరా టీజర్ జీ జాన్ సే దేఖ్ లేనా..!



Full View
Tags:    

Similar News