ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'రెడ్' అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది వారి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై 'స్రవంతి' రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఇచ్చిన జోష్ తో త్వరగా షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. గత ఏడాది ప్రారంభమైన ఈ చిత్రం తమిళ మూవీ 'తదమ్' స్టోరీ లైన్ ఆధారంగా రూపొందింది. సినిమా టైటిల్ మాదిరిగానే కథ - కథనం కూడా చాలా కొత్తగా ఉంటాయని దర్శకుడు వెల్లడించారు. కరోనా ఎఫెక్ట్ లేకుంటే ఈ 'రెడ్' ఈపాటికి థియేటర్లలో సందడి చేస్తూ ఉండేది. ఏప్రిల్‌లో రిలీజ్ కావలసిన ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మూవీని డిజిటిల్ స్ట్రీమింగ్స్ లో విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. ఈ 'రెడ్' చిత్రానికి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో మంచి ధర వచ్చిందని అందులో రిలీజ్ చేద్దామా వద్దా అనే డైలామాలో ఉన్నట్టు రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో కొన్ని వెబ్ సైట్స్ 'రామ్ డైలమాలో ఉన్నాడా..?.. 'రెడ్' సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ కాబోతోందని న్యూస్ స్ప్రెడ్ చేసేసాయి.
దీనిపై స్పందించిన రామ్ పోతినేని ఈ పుకార్లను ట్విట్టర్ వేదికగా కొట్టిపారేశాడు. 'నా ఫ్యాన్స్ అందరూ RED సినిమాను బిగ్ స్క్రీన్ లో చూడాలని ఎదురుచూస్తున్నానంటూ' ట్వీట్ చేశాడు. అయితే ఇప్పుడు ఈ పుకార్లపై చిత్ర యూనిట్ కూడా స్పందించిందట. 'రెడ్' సినిమా థియేటర్ లో రిలీజ్ అవ్వకపోవడమేంటి...! నాన్ సెన్స్..! అంటూ రామ్ పోతినేని వర్గాలు లేటెస్ట్ గా స్టేట్ మెంట్స్ ఇస్తున్నారట. వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్ గా ఉండటానికి కారణం 'ఇస్మార్ట్ శంకర్' సినిమానే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా మన తెలుగు రాష్టాల్లోని అన్ని బీ సీ సెంటర్లలో దుమ్ము దులిపింది. ఇప్పుడు రామ్ సినిమా వస్తుందంటేనే బీ సీ సెంటర్ల ఆడియెన్స్ ఆ సినిమా కోసం రెడీగా ఉంటున్నారు. ఈ హోప్ తో రామ్ 'రెడ్' సినిమాకి కరోనా లాక్ డౌన్ ఎత్తేశాక థియేటర్స్ ఎలాట్ చేయడంలో ఎగ్జీబీటర్స్ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపుతారు. ఈ చిన్న లాజిక్ కూడా ఆలోచించకుండా 'రెడ్' సినిమాకి థియేటర్ రిలీజ్ ఉండదంటూ కొందరు గాచిప్స్ క్రియేట్ చేసి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం దారుణం అని రామ్ పోతినేని టీమ్ చెబుతోంది.
అయితే 'ఇస్మార్ట్ శంకర్' లో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ 'రెడ్'లో కూడా ఉండాలి.. లేకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. తేడా కొడితే అంతా 'రెడ్' అయిపోతారని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. ఏదేమైనా 'ఇస్మార్ట్ శంకర్' సినిమా తర్వాత రామ్ నుండి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో ఎలాంటి ఫలితాన్ని పొందబోతుందో తెలియాలంటే రామ్ చెప్పినట్టు థియేటర్లలో రిలీజయ్యే దాకా వెయిట్ చేయాల్సిందే.