ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిని ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన పుట్టింది నెల్లూరు జిల్లాలో అయినా కూడా ఆయనకు తమిళనాడులో అత్యధికంగా అభిమానులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్థాయిలో అక్కడ అభిమానులు ఉన్నారు. బాలు మృతి చెందిన వార్త తెలిసిన వెంటనే చెన్నైలోని ఆయన ఇంటి వద్దకు వేలాది మంది అభిమానులు వెళ్లారు. కరోనా భయం ఉన్నా కూడా ఆయన పై అభిమానంతో ఆయన చివరి చూపి దక్కుతుందేమో అనే ఉద్దేశ్యంతో వెళ్లారు. కాని వారి ఆశ నిరాశ అయ్యింది.
బాలు ఇంటి ముందు ఒక అభిమాని చాలా సమయం ఆయన పాడిన పాటలు పాడుతూ పాడుతూ అలాగే కుప్పకూలిపోయారు. కన్నీరు పెట్టుకున్నారు. ఆయనతో పాటు ఎంతో మంది అభిమానులు అక్కడ కన్నీరు పెట్టుకున్నారు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న బాలు గారు అర్థాంతరంగా వెళ్లి పోవడంను ఏ ఒక్కరు జీర్ణించుకోలేక పోతున్నారు. 40 వేల పాటలను 16 భాషల్లో పాడిన గాన గంధర్వుడు లేడు అంటే పాటలే చిన్నబోతాయి. అలాంటి అభిమానులు కుప్పకూలడం అంటే అతిశయోక్తి కాదు. ఆయన లేరు అనే వార్తను ఏ ఒక్కరు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయనకు అభిమానులు అశ్రు నివాళ్లు అర్పిస్తున్నారు. ఇంతటి అభిమానం దక్కించుకున్న బాలు గారు అదృష్టవంతులు.