మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే 'సైరా నరసింహారెడ్డి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. థియేటర్లలో సైరా ఉండగానే చిరు 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో ప్రారంభం అయ్యింది. పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను విడుదల చేసే ఉద్దేశ్యంతో దర్శకుడు కొరటాల శివ చాలా స్పీడ్ గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇదే సమయంలో మెగా 152 చిత్రానికి 'గోవింద ఆచార్య' అనే టైటిల్ ను ఖరారు చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలయ్యింది.
'గోవింద ఆచార్య' టైటిల్ తో చిరంజీవి ఒక స్టిల్ తో పోస్టర్ కూడా బయటకు వచ్చింది. ఆ పోస్టర్ చూడ్డానికి అచ్చు అఫిషియల్ పోస్టర్ మాదిరిగానే ఉండటంతో మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఆ పోస్టర్ ను తెగ వైరల్ చేశారు. కొన్ని గంటల్లో లక్షల మందికి ఈ పోస్టర్ చేరిపోయింది. అయితే అదో ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ తో పాటు మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
మెగా 152 టైటిల్ పోస్టర్ విషయమై మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ అఫిషియల్ ట్విట్టర్ పేజీలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు చిరు 152 చిత్రం టైటిల్ ను ఖరారు చేయలేదని.. మేము సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు ఇతర వివరాలను ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యాక అధికారికంగా ప్రకటిస్తామని ట్వీట్ చేయడం జరిగింది. పోస్టర్ చూసి అబ్బ చిరు ఏమున్నాడని సంతోషపడ్డ మెగా ఫ్యాన్స్ అఫిషియల్ ప్రకటనతో ఉసూరుమంటున్నారు.
సైరా చిత్రం ప్రమోషన్ లో బిజీగా ఉన్న చిరంజీవి కాస్త గ్యాప్ తీసుకుని వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇంకా హీరోయిన్ ఎవరు అనే విషయమై అధికారికంగా ప్రకటన రాలేదు. త్రిషను హీరోయిన్ గా పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి సినిమా ప్రారంభం కాకుండానే మెగా 152 గురించి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది.