సినీ ప్రముఖులకు అభిమానులు కొత్త కాదు. వారి అభిమానం రోటీనే. కానీ.. తనను అభిమానించే ఫ్యాన్స్ అభిమానానికి కాస్త భిన్నంగా రియాక్ట్ అయ్యింది మరాఠా బ్యూటీ. అభిమానులు తమపై ప్రదర్శించే అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతుంటారు. అదే మాదిరి అభిమానులు కూడా తమ అభిమాన తారల్ని ఎవరికి వారు తమకు నచ్చిన స్టైల్లో అభిమానిస్తూ.. ఆరాధిస్తుంటారు.
తాజాగా పూజాహెగ్డేను అమితంగా ఆరాధించే అభిమాని ఒకరు కాస్త భిన్నంగా తన అభిమానాన్ని ప్రదర్శించారు. చేతుల్లో సెల్ ఫోన్లు వచ్చేసిన వేళ.. మనసుకు నచ్చిన ప్రతి అంశాన్ని కెమేరాలో బంధించే అలవాటు ఇప్పు్డు ఎక్కువైంది. తాజాగా పూజా హెగ్డే ఫ్యాన్ ఒకరు ఆమె నటించిన అరవింద సమేత సినిమా పోస్టర్ లో ఆమె బుగ్గను పట్టుకున్నాడు. వీధిలో పోస్టర్ దగ్గర పూజా బుగ్గను పట్టుకొని ఫోటో తీయించుకున్నాడు.
అది కాస్తా సోషల్ మీడియాలో రావటం.. వైరల్ కావటం జరిగిపోయింది. చివరకు కొందరు సన్నిహితుల ద్వారా పూజా హెగ్డే వరకూ ఆ ఫోటో వెళ్లింది. దాన్ని ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంటూ.. తనపై ఫ్యాన్స్ ఇష్టాన్ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘నీకు నాపై ఉన్న ప్రేమను ఫీల్ అయ్యా’ అని సదరు అభిమానిని ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టారు. తానెంతో ఆరాధించే ఆ వీరాభిమానికి పూజా హెగ్డే రియాక్షన్ చేరిందా? అన్న దానిపై క్లారిటీ రాలేదు. తాను ఆరాధనతో పోస్టర్ మీద పూజా చెక్కిలి పట్టుకుంటే.. ఆమె ఆ అభిమాన టచ్ ను ఫీలైన వైనం సదరు అభిమానికి తెలిస్తే మరెంత ఖుషీ అవుతారో.. అంతా బాగానే ఉంది కానీ.. అమ్మడి రియాక్షన్ కు స్పందనగా.. అదే పనిగా బుగ్గలు పట్టుకునే ఫోటోలు పోస్టు చేస్తే పూజా రియాక్షన్ ఎలా ఉంటుందో..?